Jabardasth Varsha : సీరియల్స్ ఎందుకు మానేసిందో చెప్పిన జబర్దస్త్ వర్ష.. పాపం..
జబర్దస్త్ తో ఒక్కసారిగా పాపులారిటీ తెచ్చుకుంది వర్ష. (Jabardasth Varsha)
- Saketh U
- Published on- November 2, 2026 / 03:51 PM IST
Jabardasth Varsha
Jabardasth Varsha : జబర్దస్త్ తో ఒక్కసారిగా పాపులారిటీ తెచ్చుకుంది వర్ష. జబర్దస్త్, పలు టీవీ షోలతో బాగా వైరల్ అయింది. ఇమ్మాన్యుయేల్ – వర్ష లవ్ ట్రాక్ జబర్దస్త్ లో బాగా వర్కౌట్ అయింది. దాంతో వర్ష స్టార్ సెలబ్రిటీగా మారింది. అయితే అంతకు ముందే ఎన్నో ఏళ్ళ నుంచి వర్ష టీవీ పరిశ్రమలో ఉంది.
గతంలో వర్ష తూర్పు పడమర, అభిషేకం, ప్రేమ ఎంత మధురం.. లాంటి పలు సీరియల్స్ లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైంది. కానీ జబర్దస్త్ కి వచ్చిన తర్వాత సీరియల్స్ మానేసి పూర్తిగా షోలు మాత్రమే చేస్తుంది. తాజాగా తాను హోస్ట్ చేస్తున్న ఓ ఇంటర్వ్యూలో వర్ష సీరియల్స్ ఎందుకు మానేసిందో తెలిపింది.
వర్ష మాట్లాడుతూ.. సీరియల్స్ అంటే ఉదయం 6కి లేవాలి. సీరియల్ షూట్ అయి వచ్చేసరికి రాత్రి 9 దాటుద్ది. మళ్ళీ నెక్స్ట్ డే కూడా అంతే. కంటిన్యూ ఒక అయిదారు రోజులు షెడ్యూల్ అలాగే ఉంటుంది. దాదాపు 5 ఏళ్ళు కంటిన్యూగా సీరియల్స్ చేశాను. దాంతో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. కరెక్ట్ నిద్ర లేకపోవడం, కరెక్ట్ ఫుడ్ లేకపోవడం వల్ల మైగ్రేన్, బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చాయి. హెల్త్ చాలా ప్రాబ్లమ్ అయింది. ఏమైనా చేయొచ్చు కానీ సీరియల్స్ చేయడం మాత్రం చాలా కష్టం. ఆ టైమింగ్స్, ఆ డ్రెస్ ఛేంజింగ్స్ చాలా కష్టం.
కానీ నేను సీరియల్స్ వల్లే ఇక్కడి దాకా వచ్చాను. ప్రేమ ఎంత మధురం సీరియల్ చూసే వాళ్ళు ఇప్పటికి ఆ సీరియల్ వల్లే గుర్తు పడతారు. అయినా హెల్త్ సమస్యల వల్లే నేను సీరియల్స్ కి దూరం అయ్యాను. ఇప్పుడు టీవీ షోస్ నడుస్తున్నాయి కాబట్టి ఇవి చేస్తున్నాను. భవిష్యత్తులో సీరియల్స్ చేస్తానో లేదో తెలీదు అని తెలిపింది.
