Salaar: జగ్గూభాయ్ ఫస్ట్‌లుక్.. ఇది అరాచకమే బాసూ!
సౌత్ లో ఒకటైన కన్నడ బాషలో తెరకెక్కి దేశవ్యాప్తంగా సంచలన విజయం నమోదుచేసుకున్న కేజేఎఫ్ సినిమాతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా దర్శకుడిగా మారిపోయాడు.
- Naresh Mannam
- Published On : August 23, 2021 / 10:59 AM IST
Salaar
Salaar: సౌత్ లో ఒకటైన కన్నడ బాషలో తెరకెక్కి దేశవ్యాప్తంగా సంచలన విజయం నమోదుచేసుకున్న కేజేఎఫ్ సినిమాతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా దర్శకుడిగా మారిపోయాడు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సలార్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కాగా.. ఈ సినిమాలో శృతి హసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా సగభాగం పూర్తవగా ఈ సినిమాకు సంబంధించిన లుక్స్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తూనే ఉన్నాయి.
ఇప్పటికే సినిమా నుండి విడుదలైన ప్రభాస్ యాక్షన్ స్టిల్స్ నుండి.. లీకైన షూటింగ్ స్టిల్స్ వరకు సినిమాని రేంజ్ ని అమాంతం పెంచేయగా.. ఇప్పుడు తాజాగా వచ్చిన జగపతి బాబు లుక్ అయితే.. సినిమా రేంజ్ ను ఆకాశానికి పెంచేశాయి. రాజమనార్ పాత్రలో జగపతి ఇలా ఉంటానంటూ సలార్ యూనిట్ తాజాగా ఒక పోస్టర్ విడుదల చేసింది. ఇందులో జగ్గూభాయ్ లుక్ అరాచకంగా కనిపిస్తుంది.
సినిమాలో విలన్ ఎంత క్రూరంగా కనిపిస్తే హీరో అంతకు రెట్టింపుగా ప్రేక్షకులకు గుర్తుండిపోతాడని ఓ సినిమా సిద్ధాంతం ఉంది. ఆ లెక్క ప్రకారం చూస్తే జగపతి లుక్ క్రూరులకే కౄరుడుగా కనిపిస్తుంది. సలార్ బొగ్గుగనులకు సంబంధించిన కథగా ప్రచారం జరుగుతుండగా అందుకు తగ్గట్లే జగపతి బ్లాక్ స్కిన్, ఒరిజినల్ గడ్డంతో ఊరమస్ లో కనిపించి ఒకవిధంగా అందరికీ షాక్ ఇచ్చేశాడు. జగపతి ఒక పాత్రని టేకప్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పటికే చాలా సినిమాలలో చూసిన ప్రేక్షకులు రాజమనార్ పాత్రలో జగపతి ఎలా ఉంటాడా అని ఇప్పటి నుండే ఊహించేసుకుంటున్నారు.
Introducing @IamJagguBhai as 𝐑𝐚𝐣𝐚𝐦𝐚𝐧𝐚𝐚𝐫 from #Salaar.#Prabhas @prashanth_neel @shrutihaasan @VKiragandur @hombalefilms @HombaleGroup pic.twitter.com/KGWW2fwBD8
— Hombale Films (@hombalefilms) August 23, 2021
