×
Ad

Jai Hanuman: హనుమాన్ జన్మస్థలంలో మొదలైన “జై హనుమాన్” మూవీ.. అంజనాద్రిలో ప్రత్యేక పూజలు

అంజనాద్రి లో మొదలైన జై హనుమాన్(Jai Hanuman) సినిమా షూటింగ్.

Jai Hanuman movie shooting begins in Anjanadri

Jai Hanuman: 2024 సంక్రాంతికి విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా హనుమాన్. తేజ సజ్జ హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సూపర్ హీరో కాన్సెప్ట్ తో డివోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. అతి తక్కవ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డ్స్ క్రియేట్ చేసింది.

Manasa Varanasi: లేటెస్ట్ బ్యూటీ మానస వారణాసి.. చీరలో క్యూట్ ఫోటోలు వైరల్

ఇక సినిమా క్లైమాక్స్ లో భగవాన్ శ్రీ హనుమాన్ ను చూపించిన తీరు సినిమాకె హైలెట్ గా నిలించింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్(Jai Hanuman) సినిమాను ప్రకటించాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. రెండేళ్ల క్రితం అధికారిక ప్రకటన వచ్చిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎట్టకేలకు నేడు ప్రారంభమయ్యింది. గ్రాండ్ పూజా కార్యక్రమం కర్ణాటకలోని హంపి సమీపంలో ఉన్న అంజనాద్రి బెట్టలో ఘనంగా ఈ సినిమా పూజాకార్యక్రమాలతో మొదలయ్యింది. రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమంలో ప్రశాంత్ వర్మ, తేజ సజ్జాతో పటు చిత్ర బృందం పాల్గొన్నారు. హనుమాన్ సినిమాలో హీరోగా నటించిన తేజ సజ్జా కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు.