Sattendru Maaruthu Vaanilai : ‘సత్తెన్ద్రు మారుదు వానిలై’ మూవీ రివ్యూ.. తెలుగులోకి వచ్చిన రొమాంటిక్ థ్రిల్లర్..

Sattendru Maaruthu Vaanilai Review

  • Published on- June 6, 2026 / 03:47 PM IST

Sattendru Maarudhu Vaanilai

Sattendru Maaruthu Vaanilai Review : జై, మీనాక్షి గోవిందరాజన్ జంటగా తెరకెక్కిన తమిళ సినిమా ‘సత్తెన్ద్రు మారుదు వానిలై’. BV ఫ్రేమ్స్ బ్యానర్ పై బివి షర్మిల నిర్మాణంలో బాబు విజయ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తమిళ్ లో మే 15న థియేటర్స్ లో రిలీజయిన ఈ సినిమా జూన్ 5 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళ్, తెలుగు భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.

కథ విషయానికొస్తే..

చంద్రు(జై) ఓ అనాథ. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఉంటాడు. జాను(మీనాక్షి గోవిందరాజన్) ఓ మినిస్టర్ కూతురు. డబ్బు, పదవి కోసం తన కూతుర్ని ఓ ముసలి రాజకీయనాయకుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకోవడంతో జాను ఇంట్లోంచి పారిపోతుంది. జాను ఫ్రెండ్ రనీశ్ ఆమెని పెళ్లి చేసుకొని ఆమె 300 కోట్ల ఆస్తి కొట్టేయాలనుకుంటాడు. ఓ పబ్ లో జానుని చూసిన చంద్రు ఆమెని ఇష్టపడతాడు. రనీశ్ – జాను గొడవ అవ్వడం, చంద్రు ఆమెకు హెల్ప్ చేయడంతో వీరిద్దరూ దగ్గరయి పెళ్లి చేసుకుంటారు. పెళ్లయ్యాక హనీమూన్ కి ఈ జంట ఓ రిసార్ట్ కి వెళ్తారు.

ఆ రిసార్ట్ ఓనర్ చక్రవర్తి(గరుడ రామ్) తన హోటల్ కి వచ్చే కపుల్స్ వీడియోలు సీక్రెట్ గా రికార్డ్ చేసి డార్క్ వెబ్ కి అమ్మడానికి ప్లాన్ చేస్తాడు. ఓ ఘటనతో ఈ విషయం చంద్రుకి తెలుస్తుంది. అదే సమయంలో రనీశ్.. జాను – చంద్రు విడిపోయేలా ప్లాన్ చేస్తాడు. కానీ జాను కనిపించకుండా పోతుంది. అసలు జాను ఎక్కడుంది? జాను – చంద్రు మళ్ళీ కలుస్తారా? చక్రవర్తిని చంద్రు ఏం చేస్తాడు? ఈ కేసుల్లోకి పోలీసులు ఎలా వస్తారు.. ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

Also Read : Peddi Collections : బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ది దూకుడు.. రెండు రోజుల్లో క‌లెక్ష‌న్స్ ఎంతంటే?

సినిమా విశ్లేషణ..

సత్తెన్ద్రు మారుదు వానిలై అంటే సడెన్ గా వాతావరణం మారింది అని అర్ధం. ఓపెనింగ్ సీన్ జాను మిస్ అయిందని ఓపెన్ చేసి ఫ్లాష్ బ్యాక్ లో సినిమాని నడిపిస్తారు. ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల పరిచయం, చంద్రు – జాను ప్రేమ, పెళ్లి, రిసార్ట్ ఓనర్ బిజినెస్ డీల్స్, అతని గురించి చంద్రుకు తెలియడంతో సాగుతుంది. సెకండ్ హాఫ్ రనీశ్.. వీళ్ళిద్దర్నీ ఎలా విడగొడతాడు, అసలు జాను ఏమైంది? చక్రవర్తిని చంద్రు ఏం చేసాడు అని సాగుతుంది.

ఫస్ట్ హాఫ్ అంతా బోరింగ్ గా, వర్కౌట్ అవ్వని ఆఫీస్ కామెడీ సీన్స్ తో, కొన్ని రొమాంటిక్ సీన్స్, ఓ యాక్షన్ సీన్ తో సాగుతుంది. ఇంటర్వెల్ కి సినిమాపై ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ థ్రిల్లర్ జానర్ లో ఏం జరిగింది అని కాస్త ఇంట్రెస్ట్ గా సాగుతుంది. చివరి 20 నిముషాలు సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. ఒక్కో ట్విస్ట్ రివీల్ చేస్తూ జాను ఏమైంది? చక్రవర్తి ఏమయ్యాడు అని చూపించే సీన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ అంతా సాగదీసినా సెకండ్ హాఫ్ మాత్రం కాస్త థ్రిల్ మోడ్ లో నడిపించాడు. ఫార్వార్డ్ చేసుకుంటూ చూడొచ్చు. ఆహాలో తెలుగులోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేసినా టైటిల్ మాత్రం అదే తమిళ్ టైటిల్ ఉంచడం గమనార్హం.

నటీనటుల పర్ఫార్మెన్స్..

తమిళ్ హీరో జై పర్వాలేదనిపించారు. మీనాక్షి గోవిందరాజన్ అందంగా కనిపిస్తూనే కొన్ని ఎమోషనల్ సీన్స్ లో బాగానే నటించింది. నెగిటివ్ షేడ్స్ లో గరుడ రామ్, హీరోయిన్ తండ్రి పాత్ర చేసిన నటుడు, రనీశ్ పాత్ర చేసిన నటులు బాగానే నటించారు. యోగి బాబు, సత్యన్ కామెడీ ట్రై చేసారు కానీ అంతగా పండలేదు. శ్రీమాన్, ఆదిత్య కథిర్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.

Also See : Akhil Wedding anniversary : అక్కినేని అఖిల్ పెళ్లి రోజు.. స్పెష‌ల్ ఫోటోలు.. వైర‌ల్‌

సాంకేతిక అంశాలు..

సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. పాటలు బాగోలేవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఎడిటింగ్ లో కొన్ని ల్యాగ్ సీన్స్ కట్ చేస్తే బెటర్. ఓ జంట జీవితంలో జరిగే సంఘటనలతో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించే ప్రయత్నం చేసాడు దర్శకుడు. తెలుగు డబ్బింగ్ చాలా చోట్ల వర్కౌట్ అవ్వలేదు. నిర్మాణపరంగా సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘సత్తెన్ద్రు మారుదు వానిలై’ ఓ జంట జీవితంలో జరిగిన సంఘటనలతో తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమాకు 2 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.