Jailer OTT Release : జైలర్ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..! ముహూర్తం ఆరోజు..!
సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ఇండస్ట్రీ హిట్ కొట్టి చాలా కాలమే అయ్యింది. ఇటీవల ఆయన నటించిన పలు సినిమాలను అంచనాలను అందుకోలేకపోవడంతో ఇక ఆయన పని అయిపోయినట్లే అని కొందరు భావించారు.
- Thota Vamshi Kumar
- Published On : August 23, 2023 / 09:28 PM IST
Jailer OTT Release
Jailer Movie OTT Release : సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ఇండస్ట్రీ హిట్ కొట్టి చాలా కాలమే అయ్యింది. ఇటీవల ఆయన నటించిన పలు సినిమాలను అంచనాలను అందుకోలేకపోవడంతో ఇక ఆయన పని అయిపోయినట్లే అని కొందరు భావించారు. అయితే.. జైలర్ చిత్రంతో సూపర్ కమ్ బ్యాక్ ఇచ్చారు రజినీ. నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ ఇండస్ట్రీలో రికార్డులను అన్నింటినీ బ్రేక్ చేసింది. తలైవా ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు సగర్వంగా తలెత్తుకునేలా చేసింది. ఓ వైపు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు సునామీ కొనసాగుతుండగా మరో వైపు ఈ చిత్ర ఓటీటీ డేట్ ఫిక్సైనట్లు తెలుస్తోంది.
Urvashi Rautela : ఆ గౌరవం అందుకున్న తొలి నటిగా ఊర్వశి రౌతేలా.. రిషబ్ పంత్ పేరుతో..
తమన్నా (Tamannaah), కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohanlal), జాకీ ష్రాఫ్, కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతూ 13 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.560 కోట్ల గ్రాస్‌ను వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చాలా మంది ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు.
Samantha : ఒంటరిగా జీవించడం అరుదైన బహుమతి.. అవకాశం వస్తే వదులుకోకండి.. సమంత పోస్ట్ వైరల్..!
సన్ పిక్చర్స్ సంస్థ దాదాపు 200కోట్ల బడ్జెట్‌తో జైలర్ సినిమాను నిర్మించగా తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన సన్‌నెక్ట్స్ ద్వారానే రిలీజ్ చేయాలని నిర్ణయించుకుంది. సెప్టెంబర్ 7 ఈ సినిమా సన్‌నెక్ట్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక హిందీ డబ్బింగ్ వర్షెన్ నెట్‌ఫ్లిక్స్‌లో అదే రోజు విడుదల కానున్నట్లు టాక్. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. అయితే.. ఒకవేళ జైలర్ సినిమా కలెక్షన్లు అప్పటికి కూడా స్టడీగా ఉంటే మాత్రం స్ట్రీమింగ్ డేట్ మారే అవకాశం ఉంది.
