Sridevi : వివాదంలో శ్రీదేవి ఆస్తి.. కోర్టుకెళ్లిన బోనీకపూర్, జాన్వీ కపూర్..
చంద్రశేఖర్ బతికున్నంతకాలం మాకు ఏ సమస్య రాలేదు అని కేసును కొట్టివేయమని అడిగారు. (Sridevi)
- Saketh U
- Published On : March 17, 2026 / 07:51 PM IST
Sridevi
Sridevi : శ్రీదేవి 1988లో చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్ సమీపంలో 4.7 ఎకరాల ఆస్తి కొనుగోలు చేసింది. ఇన్నాళ్లు ఆ ఆస్తి కపూర్ ఫ్యామిలీ వద్దే ఉండగా ఇప్పుడు దానిపై వివాదం తలెత్తింది. ఆ ఆస్తిపై చంద్రభాను అనే మహిళ, ఆమె పిల్లలు అది మా తాత ప్రాపర్టీ, మాకు చెందుతుంది, తప్పుడు పాత్రలతో ఆస్తిని కాజేశారు అంటూ ఇటీవల జిల్లా కోర్టుకు వెళ్లారు.
అయితే కపూర్ ఫ్యామిలీ.. ఆ ల్యాండ్ ఓనర్ చంద్రశేఖర్ మొదటి భార్యతో ఉన్నప్పుడే చంద్రభానుతో పెళ్లి జరిగింది. బహుభార్యత్వ చట్టం కింద అసలు ఈ పెళ్లి లెక్కలోకి రాదు, వాళ్ళు వారసులు అవ్వరు. అయినా 1988 నాటి దస్తావేజులను సవాలు చేస్తూ 37 సంవత్సరాల తర్వాత ఫిర్యాదు దాఖలు చేయడం ఏంటి? చంద్రశేఖర్ బతికున్నంతకాలం మాకు ఏ సమస్య రాలేదు అని కేసును కొట్టివేయమని అడిగారు.
Also Read : Manchu Lakhsmi Daughter : మంచు లక్ష్మి కూతురు విద్యా నిర్వాణ ఓణీల వేడుక.. ఫొటోలు..
చంద్రభాను ఫ్యామిలీ.. ఈ ఆస్తి, అక్రమ లావాదేవీల గురించి తమకు 2023లోనే తెలిసిందని అందుకే 2025లో దావా వేయాలని నిర్ణయించుకున్నామని చెప్పడంతో కోర్టు కేసు కొట్టివేయలేదు. దీంతో కపూర్ ఫ్యామిలీ మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు.
ఈ ల్యాండ్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని సమర్పిస్తూ కేసుని కొట్టివేయాలని బోనీకపూర్, జాన్వీ కపూర్ మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు. జస్టిస్ టీవీ తమిళ్‌సెల్వి ఎదుట ఈ పిటిషన్ రాగా విచారణ అనంతరం మార్చి 26కు వాయిదా వేశారు.
Also See : Inaya Sulthana : ట్రెడిషినల్ లుక్స్ లో.. రంజాన్ స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన ఇనయా సుల్తానా..
