Janhvi Kapoor : ‘పెద్ది’లో జాన్వీ కపూర్ పాత్రపై విమర్శలు.. కేవలం ఎక్స్‌పోజింగ్ కి మాత్రమే వాడారంటూ..

జాన్వీ ఇలా తన పాత్రపై నెగిటివ్ గా ఉన్న ఆర్టికల్ లైక్ కొట్టడంతో చర్చగా మారింది. (Janhvi Kapoor)

  • Published on- June 5, 2026 / 06:02 PM IST

Janhvi Kapoor

Janhvi Kapoor : రామ్ చరణ్ పెద్ది సినిమా జూన్ 4న రిలీజయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాలో చరణ్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. అయితే ఈ సినిమాలో జాన్వీ పాత్రకు ఏ మాత్రం ఇంపార్టెన్స్ లేదంటున్నారు ప్రేక్షకులు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ అక్కడక్కడా కనిపిస్తూ అందాలు ఆరబోస్తూ ఉంటుంది. అసలు కథలో జాన్వీ లేకపోయాయినా సినిమా నడుస్తుంది. కానీ ఎందుకు జాన్వీని తీసుకున్నారో దర్శకుడికే తెలియాలి.

అయితే జాన్వీ పాత్రపై విమర్శలు వస్తున్నాయి. పలువురు నెటిజన్లు, సెలబ్రిటీలు జాన్వీ పాత్రను కేవలం ఎక్స్‌పోజింగ్ కోసమే వాడారంటూ, హీరోయిన్ ని ఒక వస్తువుగా మాత్రమే చూపించారని, ఆమెకు ఎలాంటి ప్రాధాన్యం లేదని విమర్శిస్తున్నారు. ఇక జాన్వీ అనుకోకుండా సోషల్ మీడియాలో ఓ నెగిటివ్ రివ్యూ రాసిన పోస్ట్ కి లైక్ చేసింది. దాంట్లో జాన్వీకపూర్‌ పాత్రకు సరైన ప్రాధాన్యం లేదని, పెద్ది భారతీయ సినిమా చరిత్రలో ఒక కథానాయికకి జరిగిన అత్యంత అవమానం అని రాశారు.

Also See : Peddi Success Meet : పెద్ది సక్సెస్ ప్రెస్ మీట్.. సందడి చేసిన బుచ్చిబాబు..

జాన్వీ ఇలా తన పాత్రపై నెగిటివ్ గా ఉన్న ఆర్టికల్ లైక్ కొట్టడంతో చర్చగా మారింది. ఆమె ఆర్టికల్ చూసుకోకుండా కేవలం తన ఫోటో ఉందని లైక్ కొట్టింది. తర్వాత అది గమనించి అన్ లైక్ చేసింది ఆ పోస్టును. దీంతో అనుకోకుండానే జాన్వీ ఆ పోస్ట్ ని లైక్ చేసిందని అంటున్నారు.

తాజాగా సింగర్ సుమంగళి.. శక్తిహీనత వల్ల కలిగే వేదన గురించి ఒక కథ రాయడానికి శక్తివంతులైన కొందరు మగవాళ్లు ఒక గదిలో కూర్చున్నారు. అదే సమయంలో వాళ్ళు జాన్వీ కపూర్ పాత్రను కెమెరా ముందు ఒక శరీరంగా, బలవంతపు ముద్దుకు ఒక వస్తువుగా, పాటలు ముగియగానే పారేయడానికి ఒక పనిముట్టుగా మార్చేశారు అని తన సోషల్ మీడియాలో విమర్శించింది. ఇలా పలువురు సెలబ్రిటీలు జాన్వీ పాత్రని ఒక శృంగా*రపు పాత్రగా మాత్రమే చూపించారని అంటూ విమర్శిస్తున్నారు.

Also Read : Chammak Chandra : చమ్మక్ చంద్రకు వీడియో కాల్ చేసిన జాన్వీ.. చంద్ర షర్ట్ లేకుండా..

అయితే ప్రమోషన్స్ లోనే బుచ్చిబాబు ఇలా జాన్వీ పాత్రపై, ఐటెం సాంగ్ పై విమర్శలు చేసేవాళ్లకు సమాధానాలు ఇచ్చాడు. సినిమా అంటే కొందరు ఆడియన్స్ కి మాత్రమే కాదు అందరు ఆడియన్స్ కి అంటూ తన లాజిక్ చెప్పుకొచ్చాడు. ఇక పలువురు మాత్రం తను ఇష్టపడి సినిమా చేస్తే జాన్వీకి లేని బాధ మీకెందుకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో దేవర సినిమాలో కూడా జాన్వీని కేవలం అందాల ఆరబోతకే వాడారు. ఇప్పుడు పెద్ది సినిమా బాగున్నా ఇందులో కూడా జాన్వీని అందాల ఆరబోతకు మాత్రమే వాడటం చర్చగా మారింది.