Chammak Chandra : చమ్మక్ చంద్రకు వీడియో కాల్ చేసిన జాన్వీ.. చంద్ర షర్ట్ లేకుండా..
తాజాగా బుచ్చిబాబు సాన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జాన్వీ - చంద్ర గురించి ఆసక్తికర విషయం పంచుకున్నాడు.(Chammak Chandra)
Chammak Chandra
Chammak Chandra : జబర్దస్త్ తో ఫేమ్ తెచ్చుకున్న చమ్మక్ చంద్ర ప్రస్తుతం సినిమాల్లో కమెడియన్ గా నటిస్తూ బిజీగానే ఉన్నాడు. చంద్ర పెద్ది సినిమాలో కూడా నటించాడు. రామ్ చరణ్ పెద్ది సినిమా జూన్ 4న థియేటర్స్ లో రిలీజయి దూసుకుపోతుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. జాన్వీ పక్కనే ఎప్పుడూ ఉండే పాత్రలో చమ్మక్ చంద్ర నటించాడు.
పెద్ది సినిమాలో చమ్మక్ చంద్ర పాత్ర పేరు ఐలు. తాజాగా బుచ్చిబాబు సాన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జాన్వీ – చంద్ర గురించి ఆసక్తికర విషయం పంచుకున్నాడు.
Also Read : Trisha Vijay : త్రిషకు నో చెప్పిన విజయ్.. త్రిష ప్లేస్ లో ఆ డ్యాన్స్ మాస్టర్..?
బుచ్చిబాబు మాట్లాడుతూ.. ఒకసారి చమ్మక్ చంద్ర డేట్స్ లేవు. అతను షూట్ కి రాలేదు. జాన్వీ షూట్ చేస్తున్నాం. జాన్వీ పక్కనే ఉండే క్యారెక్టర్ అతనిది. అతని గురించి అడిగితే డేట్స్ లేవని చెప్పాను. జాన్వీ నంబర్ తీసుకొని డైరెక్ట్ వీడియో కాల్ చేసింది చంద్రకు. చంద్ర అప్పుడు ఇంట్లో షర్ట్ లేకుండా ఉన్నాడు. వీడియో కాల్ లో అలాగే కనపడ్డాడు.
సినిమాలో అతని పాత్ర పేరు ఐలు. వీడియో కాల్ చేసి ఏంటి ఐలు డేట్స్ లేవు అంటున్నావంట షూట్ కి వచ్చేయ్ అని అంది జాన్వీ. చంద్ర వెంటనే నాకు ఫోన్ చేసి జాన్వీ నాకు వీడియో కాల్ చేసింది అని అడిగాడు. జాన్వీ అలా సినిమాలో తన క్యారెక్టర్ చుట్టూ ఫాలోఅప్ చేసుకునేది అని తెలిపాడు.
