Janhvi Kapoor : NTR30లో జాన్వీ ఫిక్స్? బాలీవుడ్‌లో వరుస కథనాలు..
గత కొంతకాలంగా NTR30 సినిమాలో జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా తీసుకుంటున్నారు అని వార్తలు వచ్చాయి. అయితే వీటిని బోనీ కపూర్ ఖండించి జాన్వీ ఇంకా ఏ సౌత్ సినిమా ఒప్పుకోలేదు అని గతంలో ప్రకటించాడు. జాన్వీ కూడా పలు ఇంటర్వ్యూలలో..............
- Saketh U
- Published On : February 14, 2023 / 12:28 PM IST
Janhvi Kapoor is the female lead in NTR 30 Bollywood media writes news and it goes viral
Janhvi Kapoor : RRR తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమాపై అందరికి ఆసక్తి నెలకొంది. అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా NTR30 కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. RRR తో ఎన్టీఆర్ నార్త్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు, దీంతో నార్త్ ప్రేక్షకులు కూడా అంతర్ నెక్స్ట్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. RRR సూపర్ సక్సెస్ తో NTR30 కూడా పాన్ ఇండియా సినిమాగానే తెరకెక్కనుంది. ఇప్పటికే NTR30 సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాకి కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు.
NTR30 కి సంబంధించి గతంలోనే ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా ఇప్పటికీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఈ సినిమా ప్రకటించి చాలా నెలలు అవుతున్నా ఇంకా దీని నుంచి ఎలాంటి అప్డేట్ లేదు, షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు, అసలు కాస్ట్ ఎవరెవరు ఉన్నారో తెలీదు. ఇటీవల అమిగోస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ మీరు అప్డేట్స్ అడగొద్దు, మేమే ఇస్తాము మార్చ్ చివర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుందని తెలిపాడు. దీంతో NTR30 సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
Samantha : పళని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో సమంత ప్రత్యేక పూజలు..
గత కొంతకాలంగా NTR30 సినిమాలో జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా తీసుకుంటున్నారు అని వార్తలు వచ్చాయి. అయితే వీటిని బోనీ కపూర్ ఖండించి జాన్వీ ఇంకా ఏ సౌత్ సినిమా ఒప్పుకోలేదు అని గతంలో ప్రకటించాడు. జాన్వీ కూడా పలు ఇంటర్వ్యూలలో ఇంకా ఏ సినిమా సౌత్ లో ఒప్పుకోలేదు కానీ ఎన్టీఆర్ తో సినిమా వస్తే చేస్తాను అని తెలిపింది. తాజాగా మరోసారి జాన్వీ కపూర్ NTR30 లో తారక్ సరసన నటించబోతుందని బాలీవుడ్ లో వరుస కథనాలు వస్తున్నాయి. దీంతో ఈ సారి మాత్రం ఫిక్స్ జాన్వీనే ఎన్టీఆర్ సరసన NTR30 లో కనిపిస్తుందని అంతా భావిస్తున్నారు. కానీ ఈ వార్తపై అటు జాన్వీ కానీ, NTR30 చిత్రయూనిట్ కానీ స్పందించలేదు.
