Janhvi Kapoor said she pay her EMI with the help of her social media likes count
Janhvi Kapoor: అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడంలో మాత్రం ఇబ్బందులు పడుతుంది. మొదటి సినిమా ‘ధడక్’ తరువాత ఒక హిట్టు కూడా ఇవ్వని ఈ భామ ఇప్పుడు సినిమా ఛాన్సులు అందుకోలేక నానా అవస్థలు పడుతోంది. తాజాగా ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో తన ఫోటోలకు వచ్చే లైక్స్ వల్లే ‘EMI’లు టైంకి చెల్లిస్తున్నానంటూ వ్యాఖ్యానించింది.
Janhvi Kapoor : ఓర్హాన్‌తో డేటింగ్ వార్తలపై స్పందించిన జాన్వీ కపూర్..
ఇప్పటికి అరడజను సినిమాలు చేసిన జాన్వీ.. ప్రతి సినిమాలో మధ్యతరగతి పాత్రలో కనిపిస్తూనే వచ్చింది. అయితే సోషల్ మీడియాలో ఆమె చేసే పోస్ట్ లు మాత్రం సినిమాలోని పాత్రలకు పూర్తి విరుద్ధంగా ఉంటాయి. దీని గురించి మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో.. “ఇన్‌స్టాగ్రామ్ లో మీరు పోస్ట్ చేసే అల్ట్రా గ్లామరస్ ఫోటోలను చూసిన ప్రేక్షకులు, వెండితెరపై మీ డి గ్లామరస్ పాత్రలను ఆడియన్స్ అంగీకరించ లేకపోతున్నారు” అంటూ ప్రశ్నించారు.
జాన్వీ బదులిస్తూ.. “కథకి అనుగుణంగా పాత్ర వేషధారణ ఉండాలి. దాని అనుసరించే నేను వెళుతున్నా. సినిమాలో నా పాత్ర స్వభావం అది, కానీ నిజ జీవితంలో నేను అలాంటి అమ్మాయిని కాదు. ఇక సోషల్ మీడియాలో పోస్ట్ లు అంటారా.. నేను అందంగా కనిపిస్తే నలుగురు లైక్స్ కొడతారు, దానివల్ల నాకు మరో బ్రాండ్ వస్తుంది. ఇంతకు ముందు కంటే మరింత సులభంగా నేను నా EMIలను చెల్లించగలనని” అంటూ చెప్పుకొచ్చింది. కాగా ఇటీవల ఈ అమ్మడు నటించిన ‘మిలి’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.