Janhvi Kapoor: ఆ సమయంలో పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ తీసుకునే దాని.. జాన్వీ కపూర్!

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ వెండితెరపై మరియు ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు నటించిన తాజా చిత్రం “మిలి” విడుదలకు సిద్దమవుతుంది. సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ టైటిల్ రోల్ పోషిస్తుంది. సినిమా కథాంశం ప్రకారం జాన్వీ...

Janhvi Kapoor: ఆ సమయంలో పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ తీసుకునే దాని.. జాన్వీ కపూర్!

At that time Janhvi Kapoor was taking painkiller tablets

Updated On : November 1, 2022 / 7:44 PM IST

Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ వెండితెరపై మరియు ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు నటించిన తాజా చిత్రం “మిలి” విడుదలకు సిద్దమవుతుంది. ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ సినిమా “హెలెన్”కి రీమేక్ గా వస్తుంది. ఒరిజినల్ మూవీని తెరకెక్కించిన ‘మత్తుకుట్టి జేవియర్’ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు.

Janhvi Kapoor : మొన్నటిదాకా వద్దని.. ఇప్పుడేమో టాలీవుడ్ కావాలంటున్న జాన్వీ కపూర్..

సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ టైటిల్ రోల్ పోషిస్తుంది. సినిమా కథాంశం ప్రకారం జాన్వీ 15 డిగ్రీల సెల్సియస్‌కు సెట్ చేసిన నిజమైన ఫ్రీజర్‌లో నటించాల్సి వచ్చింది. దీంతో ఆమె రోజులో దాదాపు 15 గంటలు ఫ్రీజర్‌లోనే ఉండడంతో.. అది తన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసిందని, ఇంటికి చేరుకున్నా ఆ ఫ్రీజర్‌లో ఉన్నట్లు అనిపించేదని చెప్పుకొచ్చింది.

అంతేకాదు షూటింగ్ సమయంలో తాను అనారోగ్యం పాలైనప్పుడు, 2-3 రోజులు పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ తీసుకున్నని జాన్వీ కపూర్ వెల్లడించింది. కాగా సినిమా కథాంశానికి వస్తే.. ‘మిలి’ అనే అమ్మాయి ఒక రెస్టారెంట్ లో పని చేస్తుంటుంది. ఒకరోజు అనుకోకుండా రెస్టారెంట్ కోల్డ్ స్టోరేజ్ లో చిక్కుకుపోతుంది. ఆ రాత్రిలో ఆమెకు ఎదురైనా సమస్యలను ఎలా ఎదురుకుంది, వాటి నుంచి ఎలా బయటపడింది అనేది మిగిలిన కథ.