Janhvi Kapoor: టాలీవుడ్ చాలా బెటర్.. దీపికాకు సాలిడ్ కౌంటర్ ఇచ్చిన జాన్వీ కపూర్

టాలీవుడ్ ఇండస్ట్రీపై జాన్వీ(Janhvi Kapoor) చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Janhvi Kapoor solid counter to Deepika Padukone about working hours

  • దీపికా కామెంట్స్ కు జాన్వి కౌంటర్
  • టాలీవుడ్‌పై జాన్వీ ఇంటరెస్టింగ్ కామెంట్స్
  • పని గంటల విషయంలో జాన్వీ క్లారిటీ

Janhvi Kapoor: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో దీపికా పదుకోన్ వివాదం హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. కొన్నాళ్ల క్రితం ఆమె టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్స్ అయిన ప్రభాస్ ‘స్పిరిట్’, అలాగే ‘కల్కి-2’ చిత్రాల నుండి తప్పుకుందనే వార్తలు ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఆమె రోజుకు కేవలం 8 గంటలు మాత్రమే పనిచేస్తాననే నిబంధన పెట్టడం వల్లే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. దీనితో టాలీవుడ్‌లో పని గంటల వ్యవధి, రోజుకు 12 నుండి 14 గంటల సుదీర్ఘ కాల్షీట్లు ఉంటాయా అనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. చాలా ట్రోలింగ్ కూడా జరిగింది.

AR Rahman: నా కొడుకు కూడా రామ్ చరణ్‌లా ఉండాలి.. ‘పెద్ది’ వేదికపై ఏఆర్ రెహమాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఈ నేపథ్యంలో, తాజాగా ‘పెద్ది’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్(Janhvi Kapoor) తెలుగు చిత్ర పరిశ్రమలోని వర్కింగ్ కల్చర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్‌లో పని గంటలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారని, ఇక్కడి వాతావరణం తనకు ఎంతగానో నచ్చిందని ఆమె ప్రశంసించింది. ముఖ్యంగా లంచ్ బ్రేక్ సమయంలో ప్రతి ఒక్కరూ చక్కగా విశ్రాంతి తీసుకుని, ఆ తర్వాత రెట్టించిన ఉత్సాహంతో షూటింగ్‌లో పాల్గొంటారని జాన్వి వెల్లడించింది.

తెలుగులో తాను చేసిన ‘దేవర’, ‘పెద్ది’ చిత్రాల షూటింగ్స్ సమయంలో రోజుకు 9 గంటలకు మించి ఎప్పుడూ పని చేయలేదని ఈ ముద్దుగుమ్మ స్పష్టం చేసింది. పని గంటల విషయంలో టాలీవుడ్‌ను అపార్థం చేసుకునే వారికి జాన్వి మాటలు గట్టి సమాధానంగా నిలిచాయి. ఇండస్ట్రీలో పని వాతావరణం చాలా ప్రణాళికాబద్ధంగా ఉంటుందని చెప్పడం ద్వారా, దీపికా పదుకోన్ వ్యవహారానికి ఆమె పరోక్షంగా కౌంటర్ ఇచ్చినట్లయిందని నెటిజన్లు భావిస్తున్నారు. దీంతో, ఆమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.