Janhvi Kapoor : అమ్మ చనిపోయినప్పుడు.. పెద్ద యుద్ధమే చేశా : జాన్వీకపూర్
అలనాటి అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి (Sridevi) కూతురు అయిన జాన్వీకపూర్ (Janhvi Kapoor ) తల్లి వారసత్వంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
- Thota Vamshi Kumar
- Published On : July 14, 2023 / 06:10 PM IST
Janhvi Kapoor- Sridevi
Janhvi Kapoor-Sridevi : అలనాటి అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి (Sridevi) కూతురు అయిన జాన్వీకపూర్ (Janhvi Kapoor ) తల్లి వారసత్వంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ‘మరాఠీ’లో ఘన విజయం సాధించిన ‘సైరాట్’ సినిమాకు రీమేక్‌గా ఇది రూపొందింది. తొలి సినిమా ఆశించిన విజయాన్ని అందించకపోయినా వరుసగా చిత్రాలను చేస్తూ తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె నటిస్తున్న సినిమా ‘బవాల్’.
నితీశ్ తివారీ దర్శకత్వంలో వరుణ్ ధావన్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో జూలై 21న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో జాన్వీకపూర్ తన తల్లి శ్రీదేవి మరణం గురించి మాట్లాడింది. తల్లి మరణాన్ని జీర్ణించుకోలేకపోయానని చెప్పుకొచ్చింది. ఆ బాధ నుంచి కోలుకునేందుకు పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చిందన్నారు.
Rashmika : బేబీ ప్రీమియర్.. హాజరైన విజయ్ దేవరకొండ, రష్మిక.. శ్రీవల్లి రియాక్షన్ ఇదే
జాన్వీ తన తొలి చిత్రం ధడక్ కోసం వర్క్ చేస్తున్న సమయంలో శ్రీదేవి మరణించారు. ‘ఆ సమయంలో నేను ధడక్ సినిమా షూటింగ్‌లో ఉన్నాను. ఆమె లేని లోటు ఎవ్వరు తీర్చలేనిది. ఆ నాటి పరిస్థితులను ఎదుర్కొనడం కష్టంగా ఉండేది. ఆ సమయం ఎలా గడిచింది అన్నది అస్పష్టంగా ఉంది. నాకు సరిగా గుర్తులేదు. ఏమైనప్పటికీ ఆ నెల మొత్తం నాకు ఏమీ అర్థం కాలేదు. చాలా కాలం పాటు అలాగే ఉంది. ఏదో ఒక పని చేస్తూ జీవితంలో ముందు సాగడం కష్టంగా అనిపించింది. ఆ బాధ నుంచి బయటకు వచ్చేందుకు పెద్ద యుద్దమే చేశా.’అని జాన్వీకపూర్ తెలిపింది. ఇక శ్రీదేవి తనను లడ్డూ అని పిలిచేదని జాన్వీ చెప్పింది. 2018 ఫిబ్రవరిలో దుబాయ్‌లో శ్రీదేవి మరణించారు.
Project K : ప్రాజెక్ట్ K ‘మిస్టరీ’ పై ప్రభాస్ ట్వీట్
జాన్వీకపూర్ తెలుగు చిత్ర పరిశ్రమలోనూ అడుగుపెడుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువ కానుంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.
