Rashmika : బేబీ ప్రీమియ‌ర్‌.. హాజ‌రైన విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక‌.. శ్రీవ‌ల్లి రియాక్ష‌న్ ఇదే

విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ (Anand Deverakonda) హీరోగా న‌టించిన తాజా చిత్రం బేజీ. సాయి రాజేష్ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో వైష్ణ‌వి చైత‌న్య (Vaishnavi Chaitanya)హీరోయిన్‌.

Rashmika : బేబీ ప్రీమియ‌ర్‌.. హాజ‌రైన విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక‌.. శ్రీవ‌ల్లి రియాక్ష‌న్ ఇదే

Baby screening

Updated On : July 14, 2023 / 4:25 PM IST

Rashmika Mandanna : విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ (Anand Deverakonda) హీరోగా న‌టించిన తాజా చిత్రం బేజీ. సాయి రాజేష్ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో వైష్ణ‌వి చైత‌న్య (Vaishnavi Chaitanya)హీరోయిన్‌. గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కెఎన్ నిర్మించారు. నాగబాబు, లిరీషా, కుసుమ డేగలమర్రి, సీత కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీతో తెర‌కెక్కిన ఈ సినిమా నేడు(జూలై 14న‌) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

Vijay Deverakonda : తమ్ముడు సినిమా పై విజయ్ ట్వీట్.. ఇక నువ్వే అంటున్న నెటిజెన్స్..

కాగా.. హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ఐమాక్స్ నిన్న‌(గురువారం) రాత్రి ఈ చిత్ర ప్రీమియ‌ర్ షో ను వేశారు. దీనికి హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పాటు ర‌ష్మిక మంద‌న్న(Rashmika Mandanna), రాశీ ఖ‌న్నా(Raashii Khanna) ప‌లువురు సీని ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ప్రీమియ‌ర్‌ను వీక్షించిన త‌రువాత విజ‌య్‌, రాశీ ఖ‌న్నాలు మీడియాతో మాట్లాడగా.. ర‌ష్మిక మాత్రం మీడియాకు థంబ్స్‌-అప్ సింబ‌ల్ చూపిస్తూ అక్క‌డి నుంచి వెళ్లిపోయింది.

Project K : ప్రాజెక్ట్‌ K ‘మిస్టరీ’ పై ప్ర‌భాస్ ట్వీట్

బేబీ సినిమా చూసిన త‌రువాత ర‌ష్మిక భావోద్వేగానికి గురైన‌ట్లు తెలుస్తోంది. క‌న్నీళ్లు తుడుచుకుని కాస్త ఎమోష‌న‌ల్‌గానే థియేట‌ర్ నుంచి వెళ్లిపోయింది. సినిమా ఎలా ఉంద‌ని మీడియా ప్ర‌శ్నించ‌గా బాగుంద‌నే సింబ‌ల్ చూపిస్తూ వెళ్లింది. తెల్లటి టీ ష‌ర్ట్‌, బ్లూ జీన్స్, క్యాప్ తో పాటు ముఖానికి మాస్క్ ధ‌రించి ర‌ష్మిక వ‌చ్చింది.

ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. ఎంతో సంతోషంగా ఉంద‌న్నారు. వీళ్ల న‌ట‌న ఎంతో అద్భుతంగా ఉంది. సినిమా క‌థ ఎంతో ఏడిపిస్తే, అది ఇచ్చిన స‌క్సెస్ ఎంతో సంతోషాన్ని ఇచ్చింద‌న్నారు.

Samajavaragamana OTT Release : ఓటీటీలోకి సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న..! తెలుగులోనే కాదు మ‌రో మూడు భాష‌ల్లో స్ట్రీమింగ్‌..?