Samajavaragamana OTT Release : ఓటీటీలోకి సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న..! తెలుగులోనే కాదు మ‌రో మూడు భాష‌ల్లో స్ట్రీమింగ్‌..?

చిన్న సినిమాగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సూప‌ర్ హిట్‌గా నిలిచింది సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న(Samajavaragamana). రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీ విష్ణు (Sree Vishnu) హీరోగా ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కింది.

Samajavaragamana OTT Release : ఓటీటీలోకి సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న..! తెలుగులోనే కాదు మ‌రో మూడు భాష‌ల్లో స్ట్రీమింగ్‌..?

Samajavaragamana

Updated On : July 12, 2023 / 8:44 PM IST

Samajavaragamana OTT Release Date : చిన్న సినిమాగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సూప‌ర్ హిట్‌గా నిలిచింది సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న(Samajavaragamana). రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీ విష్ణు (Sree Vishnu) హీరోగా ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కింది. జూన్ 29న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా ఇంకా బాక్సాఫీస్ వ‌ద్ద స్ట‌డీగా క‌లెక్ష‌న్లు రాబ‌డుతోంది. 12 రోజుల్లో 40 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి నిర్మాత‌కు మూడింత‌ల లాభాల్ని తెచ్చిపెట్టింది.

Rashmika Mandanna : నితిన్‌కు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చిన ర‌ష్మిక మంద‌న్న‌..? మ‌ళ్లీ మొద‌టికే..!

విడుద‌లై నెల‌రోజులు కాలేదు. థియేట‌ర్ల‌లో క‌లెక్ష‌న్ల జోరు త‌గ్గ‌క ముందే ఈ సినిమా ఓటీటీలోకి వ‌స్తుంది. ఈ సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం. జూలై 22 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఒక్క తెలుగులో మాత్ర‌మే కాకుండా త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ బాష‌ల్లోనూ స్ట్రీమింగ్ చేయాల‌ని భావిస్తోంద‌ట‌. ఇందుకు సంబంధించి త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని స‌మాచారం.

BRO second single : బ్రో నుండి రొమాంటిక్ సాంగ్‌.. సెకండ్ సింగల్ ‘జాన‌వులే’

రెబా మోనికా జాన్ (Reba Monica John) ఈ సినిమాతోనే తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది. సీనియ‌ర్ న‌టుడు నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యింగర్, వెన్నెల కిశోర్, రఘుబాబు, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్ లు త‌మ‌దైన శైలిలో న‌టించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర ప్రెజెంటర్ గా వ్యవహరించగా రాజెశ్ దండా ఈ సినిమాని నిర్మించారు. గోపిసుందర్ సంగీతం అందించాడు.