Vijay Deverakonda : తమ్ముడు సినిమా పై విజయ్ ట్వీట్.. ఇక నువ్వే అంటున్న నెటిజెన్స్..

ఆనంద్ దేవరకొండ బేబీ సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ పై విజయ్ దేవరకొండ ట్వీట్ చేశాడు.

Vijay Deverakonda : తమ్ముడు సినిమా పై విజయ్ ట్వీట్.. ఇక నువ్వే అంటున్న నెటిజెన్స్..

Vijay Deverakonda tweet on Anand Deverakonda Baby movie

Updated On : July 14, 2023 / 2:53 PM IST

Anand Deverakonda – Baby : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన రీసెంట్ మూవీ ‘బేబీ’. ట్రైయాంగులర్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాలో వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) హీరోయిన్ గా నటించగా విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) మరో హీరోగా కనిపించాడు. ఈ మూవీ నేడు జులై 14న ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే హైదరాబాద్ లో నిన్న రాత్రే ఈ మూవీ ప్రీమియర్స్ పడ్డాయి. ప్రేక్షకులతో పాటు విజయ్ దేవరకొండ మరికొంతమంది సినిమా ప్రముఖులు కూడా ఈ ప్రీమియర్ వీక్షించారు.

Geetha Arts : గీతా ఆర్ట్స్‌కు షాక్ ఇస్తున్న ఆ నిర్మాణ సంస్థలు.. టాలీవుడ్ లో ఏం జరుగుతుంది?

ప్రీమియర్ షోతోనే మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఈరోజు మార్నింగ్ షోలు చూసిన ఆడియన్స్ నుంచి కూడా సినిమా పై మంచి స్పందన వస్తుంది. మూవీలో ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవి చైతన్య యాక్టింగ్ చాలా బాగుందంటూ ప్రతి చోట నుంచి కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఈ మూవీని నిన్న రాత్రే ప్రీమియర్ చూసిన విజయ్ దేవరకొండ సినిమా పై ట్వీట్ చేశాడు. ఆనంద్ అండ్ వైష్ణవి ఫోటోలు షేర్ చేస్తూ.. “నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ బాబీస్ చాలా బాగా చేశారు. వీళ్ళ యాక్టింగ్ ప్రతి ఒక్కరి మనసు పై ప్రభావం చూపించింది. లాస్ట్ నైట్ ప్రీమియర్స్ లో సినిమా కథ ఎంతో ఏడిపిస్తే, అది ఇచ్చిన సక్సెస్ ఎంతో సంతోషాన్ని ఇస్తుంది” అంటూ రాసుకొచ్చాడు.

Mahaveerudu Twitter Review : శివకార్తికేయన్ ‘మహావీరుడు’ ట్విట్టర్ రివ్యూ.. మహావీరుడు గెలిచాడా?

ఇక ఈ పోస్ట్ చూసిన విజయ్ అభిమానులు.. తమ్ముడు హిట్టు కొట్టేశాడు. ఇక నువ్వే అన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లైగర్ వంటి ప్లాప్ తరువాత విజయ్ ‘ఖుషి’ (Kushi) సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. సెప్టెంబర్ 1న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.