Ktr: మీకు నేను ఉన్నాను.. ఖమ్మం ఇళ్ల కూల్చివేత భాదితులకు కేటీఆర్ భరోసా
ఖమ్మం ఇళ్ల కూల్చివేత భాదితులను పరామర్శించిన కేటీఆర్(Ktr).
KTR visits to Velugumatla in Khammam
- ఖమ్మం వెలుగుమట్లలో కేటీఆర్ పర్యటన
- బాధితులను పరామర్శించిన కేటీఆర్
- న్యాయం జరిగే వరకు కొట్లాడుదాం అని పిలుపు
Ktr: ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ బాధితులను పరామర్శించాడు మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. వెలుగుమట్ల భూ నిర్వాసితులతో ఆయన ముచ్చటించారు, వాళ్ళ ఆవేదనను అడిగి తెలుసుకుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మీ దగ్గర భూదాన్ బోర్డు ఇచ్చిన పట్టాలు ఉన్నాయి. భూదాన్ అంటే ప్రభుత్వమే అని చెప్పుకొచ్చారు.
కానీ, ఈ ప్రభుత్వం ఇవాళ ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఇళ్లు కూల్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మీ కోసం కొట్లాడడానికి, మీకు ధైర్యం చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. మీకు ఏమీ కాదు. మీకు అండగా నేను ఉనాన్ను. బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే స్థలంలో మీకు ఇళ్ళు కట్టిస్తాం. మీతో ఇక్కడే మళ్ళీ గృహప్రవేశాలు చేయించే బాధ్యత మాది. ఈ మీటింగ్ తరువాత కలెక్టర్ గారిని, చీఫ్ సెక్రెటరీ గారిని కూడా కలుస్తాము.
TGSRTC: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ.. టికెట్ ధరలు భారీగా తగ్గింపు
ఈ కొలిచివేతలపై కోర్టు ఆర్డర్లు కూడా ఉన్నాయి. మీకు జరిగిన అన్యాయం విషయంలో ఎక్కడిదాకైనా కొట్లాడతాం. అసెంబ్లీలో కొట్లాడతాం, శాసనమండలిలో కొట్లాడతాం. మీకు న్యాయం జరిగేవరకు ఈ విషయాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోదాం’ అంటూ బాధితులకు అండగా మాట్లాడారు కేటీఆర్.
ఇక ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నిర్మించుకున్న సుమారు 650 ఇళ్ల రెవెన్యూ అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు చేపట్టారు అధికారులు. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, కనీసం సామాన్లు సర్దుకునే సమయం కూడా ఇవ్వకుండా జేసీబీలతో ఇళ్లను నేలమట్టం చేశారని, బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
