జాన్వీ కపూర్ ‘గుంజన్ సక్సేనా’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్..
- sekhar
- Published On : July 16, 2020 / 02:51 PM IST
‘ధఢక్’ మూవీతో బాలీవుడ్‌కి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది దివంగత అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్. ఫస్ట్ మూవీతోనే మంచి సక్సెస్ అందుకున్న జాన్వీ, ప్రస్తుతం ‘గుంజన్ సక్సేనా, రూఅఫ్జానా, దోస్తానా 2’ సినిమాల్లో నటిస్తోంది. కాగా వాటిలో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గుంజన్ సక్సేనా’ మూవీ స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగష్టు 12న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. కాగా ఈ విషయాన్ని సినిమా యూనిట్ తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలియచేసింది. ఈ సినిమా కోసం జాన్వీ, ఫ్లైట్ నడపడం సహా పలు ఇతర యుద్ధ విద్యలు నేర్చుకున్న సంగతి తెలిసిందే.
