Jani Master Wife : జానీ – శేఖర్ మాస్టర్ వివాదం.. మీడియా ముందుకొచ్చిన జానీ మాస్టర్ భార్య.. డబ్బులు దోచుకుంటున్నారు అంటూ..

ఈ ప్రెస్ మీట్ లో జానీ మాస్టర్ కూడా పాల్గొని శేఖర్ మాస్టర్ తో గొడవ గురించి స్పందించాడు. (Jani Master Wife)

  • Updated on- July 13, 2026 / 05:45 PM IST

Jani master Wife

Jani Master Wife : జులై 12 ఆదివారం నాడు డ్యాన్సర్లు అసోసియేషన్ లో జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్ గొడవ పడ్డ విజువల్స్ వైరల్ అయ్యాయి. అసోసియేషన్ కి సంబంధించి పలు అంశాలపై, ఎన్నికలపై, డబ్బులపై ఈ గొడవలు జరిగాయని సమాచారం. అయితే అసలు ఈ గొడవలు ఎందుకు అనేది క్లారిటీ లేదు. తాజాగా జానీ మాస్టర్ భార్య సుమలత నేడు ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడింది. ఈ ప్రెస్ మీట్ లో జానీ మాస్టర్ కూడా పాల్గొని శేఖర్ మాస్టర్ తో గొడవ గురించి స్పందించాడు.

ఈ ప్రెస్ మెట్ లో జానీ మాస్టర్ మాట్లాడుతూ.. నేను శేఖర్ మాస్టర్ కొట్టుకున్నారు, తిట్టుకున్నారు అనేది అబద్దం. ఇవాళ మధ్యాహ్నం చిరంజీవి గారి సినిమా షూటింగ్ ప్లేస్ కి నేను, శేఖర్ అన్న వెళ్ళాము. చిరంజీవి గారితో కూర్చొని మాట్లాడుకున్నాం. అక్కడే తిన్నాము. మాకు ఎటువంటి గొడవలు లేవు. మేము హ్యాపీగానే ఉన్నాము. ఏమన్నా ఉన్నా ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు అనుకుంటారు. దాన్ని సాల్వ్ చేసుకుంటారు. ఇది యూనియన్ లో జరిగిన ఓ సమస్య. దానికి నాకు, శేఖర్ మాస్టర్ కి సంబంధం లేదు అని అన్నారు.

Also Read : Korean Kanakaraju Teaser : వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ టీజర్ వచ్చేసింది.. హారర్ కామెడీ..

ఇక యూనియన్ ఇష్యూ గురించి డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రసిడెంట్, జానీ మాస్టర్ భార్య సుమలత మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ళ నుంచి యూనియన్ లో కొన్ని తప్పులు జరుగుతున్నాయి. ఎవరు తప్పు చేసినా ప్రసిడెంట్ మీదకే వస్తుంది. ఎందుకు మీరు ప్రశ్నించలేదు అంటారు. అందుకే నేను ఏ తప్పు జరిగినా ప్రశ్నిస్తున్నాను. అది కొంతమందికి నచ్చట్లేదు. గత కమిటీలో కొన్ని ఫండ్స్ మిస్ యూజ్ అయ్యాయి. వాటిని ప్రశ్నించినందుకు మా అసోసియేషన్ లో కొన్ని సమస్యలు వచ్చాయి. లాస్ట్ టైం ఎన్నికల్లో గెలిచాక మాకు ఆపోజిట్ గా పోటీ చేసిన జోసెఫ్ మాస్టర్ వాళ్ళు మేము ఏం చేసినా తప్పే అని అంటున్నారు. అంతే తప్ప మేమంతా ఒక్కటే.

నిన్న మీడియాలో తప్పుడు వార్తలు వచ్చాయి. డ్యాన్సర్లు ఫైర్ అవుతున్నారు, అసోసియషన్ కి చెప్పకుండా బై ఎలక్షన్ నిర్వహిస్తున్నారు, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు అని వార్తల్లో చూపించారు. మీరు పోస్ట్ చేసే ముందు తెలుసుకొని పెట్టండి. థంబ్ నెయిల్స్ ఇష్టమొచ్చినట్టు పెట్టకండి. అవన్నీ అవాస్తవాలు. ఏం చేసినా అసోసియేషన్ లీగల్ గానే వెళ్తుంది. కొంతమంది ఇన్ చార్జులు, ఇప్పుడు పదవుల్లో ఉన్నవాళ్లు కూడా నిర్మాతల దగ్గర ఒక అమౌంట్ చెప్తున్నారు. ఇక్కడ డ్యాన్సర్లకి ఇంకో అమౌంట్ ఇస్తున్నారు. దీనివల్ల డ్యాన్సర్లు నష్టపోతున్నారు. డ్యాన్సర్లకి రావాల్సిన పూర్తి మొత్తం వాళ్లకు రావట్లేదు. మధ్యలో కొంతమంది ఇన్ చార్జులు డ్యాన్సర్స్ డబ్బులను అన్యాయంగా దోచుకుంటున్నారు అని తెలిపింది. మరి దీనిపై శేఖర్ మాస్టర్ కానీ, వేరే డ్యాన్స్ మాస్టర్స్ కానీ స్పందిస్తారా చూడాలి.