Korean Kanakaraju Teaser : వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ టీజర్ వచ్చేసింది.. హారర్ కామెడీ..
మీరు కూడా ఈ కొరియన్ కనకరాజు టీజర్ చూసేయండి.. (Korean Kanakaraju Teaser)
Korean Kanakaraju Teaser
Korean Kanakaraju Teaser : వరుణ్ తేజ్, రితికా నాయక్ జంటగా తెరకెక్కుతునన్ సినిమా కొరియన్ కనకరాజు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మాణంలో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే గ్లింప్స్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు. ఈ సినిమా ఆగస్టు 7న రిలీజ్ కానుంది.
ఈ టీజర్ చూస్తుంటే రాయలసీమ పెనుగొండలో ఉండే కనకరాజు కొరియాకు చెందిన ఓ ఆత్మ వల్ల కొరియాకు ఎలా వెళ్ళాడు, అక్కడ గ్యాంగ్ స్టర్ కథేంటి అని హారర్ కామెడీ యాక్షన్ కథాంశంతో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు అని, కొరియాలో చనిపోయిన ఓ గ్యాంగ్ స్టర్ కనకరాజు శరీరాన్ని వాడుకొని పగ తీర్చుకునే కథాంశంతో ఈ సినిమా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మీరు కూడా ఈ కొరియన్ కనకరాజు టీజర్ చూసేయండి..
