Jason Sanjay
Jason Sanjay : తమిళ్ స్టార్ హీరో, TVK పార్టీ నేత విజయ్ కి తన భార్య సంగీత విడాకుల నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న విజయ్ నుంచి 26 ఏళ్ళ తరువాత సంగీత విడాకులు కోరుతూ కోర్టుకెళ్లింది. విడాకుల పిటిషన్ లో విజయ్ పై పలు ఆరోపణలు కూడా చేసింది. అసలే విజయ్ మొదటిసారి ఎన్నికల బరిలో దిగుతుండటంతో తమిళనాట విజయ్ విడాకులు సంచలన చర్చగా మారాయి.
విజయ్ కొడుకు జాసన్ సంజయ్ సపోర్ట్ కూడా విజయ్ కి లేదని తమిళ మీడియా అంటుంది. విజయ్ కొడుకు జాసన్ సంజయ్ త్వరలోనే దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సందీప్ కిషన్ హీరోగా జాసన్ సంజయ్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతుంది. విడాకుల కేసు నేపథ్యంలో తాజాగా సంజయ్ తన తండ్రి విజయ్ ని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసాడు.
Also See : Niharika Konidela: క్యూట్ స్మైల్ తో నిహారిక.. బ్లాక్ శారీలో అందం కెవ్వు కేక.. ఫోటోలు
దీంతో సంజయ్ తన తల్లి వైపే ఉన్నాడని, తన తల్లికి సపోర్ట్ గా ఉండాలనుకుంటున్నాడని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ ఫ్యాన్స్ సంజయ్ పై తండ్రికి సపోర్ట్ ఇవ్వవా, విజయ్ ని కావాలని ఎన్నికల సమయంలో ఇలా చేస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. విజయ్ ఫ్యాన్స్ సంజయ్ ని తిడుతూ అతని సోషల్ మీడియా పోస్టుల కింద కామెంట్స్ చేస్తున్నారు. కానీ పలువురు మాత్రం ఇలాంటి సమయంలో సంజయ్, అతని తల్లి సంగీత స్ట్రాంగ్ గా ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఈ విడాకుల కేసు విషయంపై విజయ్ కానీ, సంగీత కానీ ఆ ఫ్యామిలీ నుంచి ఎవరూ స్పందించలేదు. సంజయ్ దర్శకుడిగా తన సినిమా ప్రమోషన్స్ కి బయటకు వస్తే మొదట తన తల్లితండ్రుల విడాకులకు సంబంధించిన ప్రశ్నలే ఎదురవుతాయి. మరి సంచలనంగా మారిన విజయ్ – సంగీత విడాకుల కేసు తమిళనాట ఎలాంటి మార్పులు తెస్తుందో చూడాలి.
Also Read : Virosh Weddind: విజయ్– రష్మిక పెళ్లి కోసం ప్రత్యేక ఆభరణాలు.. భారతీయత ఉట్టిపడేలా డిజైన్.. 10 నెలలు శ్రమించి