Faria Abdullah: భవిష్యత్తులో పెళ్లికి అర్థమే మారిపోతుంది.. ‘జాతిరత్నాలు’ బ్యూటీ షాకింగ్ విశ్లేషణ.

ప్రేమ, పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన జాతి రత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా(Faria Abdullah).

Jathi Ratnalu fame Faria Abdullah shocking comments on love and marriage.

  • ప్రేమ అద్భుతం, పెళ్లి వేరే అంశం.
  • భవిష్యత్తులో వివాహ అర్థం మారిపోవచ్చు.
  • నటి కాకుంటే షెఫ్ అయ్యేదాన్ని.

Faria Abdullah: ‘జాతిరత్నాలు’ చిట్టి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ సినిమాలో చిట్టిగా ఆమె అందరి మనసు గెలుచుకున్నారు. ఆమెనే ఫరియా అబ్దుల్లా. ఆ తరువాత కూడా పలు సినిమాల్లో నటించి టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కేవలం నటనకే పరిమితం కాకుండా తన వ్యక్తిగత అభిప్రాయాలను కూడా నిర్మొహమాటంగా పంచుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఒకవేళ నటి కాకపోయి ఉంటే క్రూయిజ్ షిప్‌లో షెఫ్‌గానో లేదా ఈవెంట్ మేనేజర్‌గానో స్థిరపడేదాన్నని, ట్రావెల్ వ్లాగింగ్‌పై కూడా తనకు ఆసక్తి ఉందని ఆమె తాజాగా పేర్కొన్నారు. వైవిధ్యమైన పాత్రలతో తన కెరీర్‌ను నిర్మించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఆమె వెల్లడించారు.

Chiru- Tharun: చిరు నుంచి పిలుపు.. వెంటనే విమానం ఎక్కిన మలయాళ డైరెక్టర్

ముఖ్యంగా ప్రేమ, పెళ్లిపై ఫరియా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె దృష్టిలో ప్రేమ ఒక అద్భుతమైన అనుభూతి అని, కానీ పెళ్లి అనేది ఒక వ్యక్తిని పూర్తిగా మార్చే ప్రక్రియ అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత తరం పెళ్లిపై ఆసక్తి కోల్పోతోందని, భవిష్యత్తులో ఈ వివాహ వ్యవస్థ అర్థమే మారిపోయే అవకాశం ఉందని ఆమె విశ్లేషించారు. జీవితానికి తోడు అవసరమని గుర్తిస్తూనే, సంబంధాల పట్ల మారుతున్న ధోరణులను ఆమె సున్నితంగా ప్రస్తావించారు.

సోషల్ మీడియా వినియోగంపై కూడా ఫరియా (Faria Abdullah)స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. పరిమితికి లోబడి సామాజిక మాధ్యమాలను వాడటం మంచిదని, అక్కడ వచ్చే గాసిప్స్ లేదా రూమర్లను పెద్దగా పట్టించుకోకూడదని ఆమె సూచించారు. కేవలం కెరీర్‌పై దృష్టి సారిస్తూ, పాత్ర చిన్నదైనా ప్రభావవంతంగా ఉంటే నటించడానికి తాను సిద్ధమని స్పష్టం చేశారు. కొత్త జానర్లను ప్రయత్నిస్తూ ప్రేక్షకులను అలరించాలన్నదే తన కోరికని, విమర్శలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతానని ఫరియా చెప్పుకొచ్చారు.