Chiru- Tharun: చిరు నుంచి పిలుపు.. వెంటనే విమానం ఎక్కిన మలయాళ డైరెక్టర్
మలయాళ దర్శకుడు తరుణ్ మూర్తిని ఇంటికి పిలిపించిన మెగాస్టార్ చిరంజీవి(Chiru- Tharun).
Megastar Chiranjeevi Meets Malayalam movie Director Tharun Moorthy
- చిరంజీవిని కలిసిన దర్శకుడు తరుణ్.
- ఇది రీమేక్ సినిమా కాదన్న క్లారిటీ.
- మెగాస్టార్ సినిమా ఉత్సాహంపై ప్రశంసలు.
Chiru- Tharun: మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్లో కొన్ని రీమేక్ సినిమాలు చేసినప్పటికీ, ఈ మధ్య కాలంలో ఆయన స్ట్రెయిట్ కథలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగానే, ఇటీవల మలయాళ దర్శకుడు తరుణ్ మూర్తి హైదరాబాద్లో చిరంజీవిని కలవడం సినిమా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ‘తుడురమ్’ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన తరుణ్ మూర్తి చిరంజీవి ఇంటికి వెళ్లడంతో, మరో రీమేక్ సిద్ధమవుతోందా అనే అనుమానాలు అభిమానుల్లో వ్యక్తమయ్యాయి.
Chiranjeevi: అమ్మే మొదటి దైవం.. మదర్స్ డే రోజున అమ్మతో అరుదైన ఫోటోలు పంచుకున్న చిరు
అయితే ఈ భేటీపై దర్శకుడు తరుణ్ మూర్తి(Chiru- Tharun) స్వయంగా క్లారిటీ ఇచ్చి రూమర్లకు చెక్ పెట్టారు. తాను చిరంజీవిని కలిసింది ‘తుడురమ్’ రీమేక్ కోసం కాదని, ఆయన ఆహ్వానం మేరకే మర్యాదపూర్వకంగా కలిశానని స్పష్టం చేశారు. చిరంజీవి తన సినిమాలను ఎంతో శ్రద్ధగా చూసి, ప్రతి సన్నివేశం గురించి లోతుగా చర్చించడం చూసి తాను ఆశ్చర్యపోయానని తరుణ్ తెలిపారు. అంతటి స్టార్డమ్ ఉన్నా సినిమాల పట్ల చిరంజీవికి ఉన్న ఆ తపన, ఉత్సాహం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, ఇది తన జీవితంలో మరచిపోలేని మధుర జ్ఞాపకమని ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు.
ప్రస్తుతం చిరంజీవి దర్శకుడు బాబీతో ఒక భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా లైన్లో ఉంది. ఈ క్రమంలో తరుణ్ మూర్తితో జరిగిన భేటీ కేవలం మర్యాదపూర్వకమైనదా లేక భవిష్యత్తులో వీరిద్దరి కాంబినేషన్లో ఏదైనా కొత్త కథ రాబోతుందా అనే ఉత్సుకత అందరిలోనూ నెలకొంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం, త్వరలోనే వీరి కలయికలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. రీమేక్ ముద్ర లేకుండా ఒక వైవిధ్యమైన స్ట్రెయిట్ కథతో ఈ మలయాళ దర్శకుడు చిరును మెప్పిస్తాడేమో చూడాలి.
View this post on Instagram
