Chiranjeevi: అమ్మే మొదటి దైవం.. మదర్స్ డే రోజున అమ్మతో అరుదైన ఫోటోలు పంచుకున్న చిరు
మదర్స్ డే రోజున తన తల్లి అంజనా దేవి గురించి ఎమోషనల్ పోస్ట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi).
chiranjeevi special photos with his mother on mothers day
- అమ్మే మొదటి గురువు, అసలైన ధైర్యం.
- మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ సందేశం.
- వైరల్ అవుతున్న అరుదైన ఫోటోలు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మాతృదినోత్సవం సందర్భంగా తన తల్లిపై ఉన్న అపారమైన అనురాగాన్ని చాటుకున్నారు. దైవం కంటే ముందే మనల్ని కనిపెంచిన అమ్మే నిజమైన దైవమని ఆయన కొనియాడారు. అమ్మ మన జీవితంలో మొదటి గురువు అని, మన ధైర్యానికి మూలస్తంభం అని పేర్కొంటూ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగపూరిత సందేశాన్ని పంచుకున్నారు. మన ప్రతి విజయం వెనుక అమ్మ చేసిన నిశ్శబ్ద త్యాగం, ఆమె ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
Balakrishna- Koratala: జనతా గ్యారేజ్ స్టైల్లో ‘కార్పెంటర్’.. సమాజాన్ని సరిదిద్దే మేస్త్రీగా బాలకృష్ణ
తమకంటే ఎక్కువగా పిల్లలను ప్రేమించే మాతృమూర్తులందరికీ చిరంజీవి(Chiranjeevi) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ప్రత్యేకమైన రోజున తన కుటుంబంతో కలిసి గతంలో దిగిన అరుదైన ఫోటోలను అభిమానులతో పంచుకోవడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. మాతృత్వం గొప్పతనాన్ని వివరిస్తూ ఆయన పెట్టిన ఈ పోస్ట్ నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. అమ్మ గొప్పతనాన్ని ఇంత అందంగా వర్ణించడంపై అభిమానులు మెగాస్టార్‌ను ప్రశంసిస్తున్నారు.
అమ్మ…
మన మొదటి గురువు,
మన మొదటి ధైర్యం,
కనిపించే దైవం కూడా “కని పెంచిన” మాతృమూర్తి తర్వాతే…!మన విజయాల వెనక త్యాగం…
మన ప్రతి అడుగులోనూ నిశ్శబ్దంగా నిలిచే ఆశీర్వాదం అమ్మది.మనకంటే మనల్ని ఎక్కువగా ప్రేమించే ప్రతి మాతృమూర్తికి హృదయపూర్వక మాతృదినోత్సవ శుభాకాంక్షలు.
Happy… pic.twitter.com/SJ1AchhEPz— Chiranjeevi Konidela (@KChiruTweets) May 10, 2026
