Jayaho Ramanuja : జయహో రామానుజ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్.. ఎప్పుడంటే..

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు. (Jayaho Ramanuja)

  • Published on- September 3, 2026 / 12:13 PM IST

Jayaho Ramanuja

Jayaho Ramanuja : లయన్ డా. సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా జయహో రామానుజ. సుదర్శనం ప్రొడక్షన్స్ బ్యానర్ పై సాయిప్రసన్న, ప్రవళ్లిక ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నటి జో శర్మ, సుమన్, ప్రవళ్లిక.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు. జయహో రామానుజ సినిమాని అక్టోబర్ 25న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృత భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత, నటి ప్రవళ్లిక మాట్లాడుతూ.. జయహో రామానుజ సినిమాను నిర్మించే అవకాశం రావడం అదృష్టం. ఈ సినిమాలో కృష్ణుడు, నారదుడు, రఘునాథస్వామి పాత్రల్లో నటించాను. సమ సమాజం కోసం పాటుపడిన రామానుజాచార్యుల వారి గురించి ఈ తరం వారికి మరింతగా తెలియజేసే ప్రయత్నం చేశాం. అక్టోబర్ 25న ఈ సినిమా రిలీజ్ కు తీసుకొస్తున్నాం అని తెలిపారు. టీఎఫ్ పీసీ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. రామానుజాచార్యుల వారి ఘనతను ఈ తరానికి తెలియజేయడంలో చినజీయర్ స్వామితో పాటు మా సాయి వెంకట్ కూడా అభినందనలు అందుకుంటున్నారు. ఆయన కావాలనుకుంటే ఏదైనా కమర్షియల్ సినిమా చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు కానీ మనుషులంతా ఒక్కటేననే సందేశాన్ని చాటిన మహనీయుడు రామానుజాచార్యుల వారి జీవిత కథను చేయడం ప్రశంసనీయం అన్నారు.

Also Read : Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10.. ఒకప్పటి హీరో, కమెడియన్ ఫిక్స్..

నటుడు,దర్శకుడు లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ.. కులం, మతం లేదు మనుషులంతా ఒక్కటే అని చెప్పిన గొప్ప మహనీయుడు రామానుజాచార్యులు. ఈ సినిమా రూపొందిస్తున్న సమయంలో ఎన్నో అద్భుతాలు నా జీవితంలో జరిగాయి. పోస్ట్ ప్రొడక్షన్ లో హై క్వాలిటీ తీసుకు వచ్చే ప్రయత్నంలో రిలీజ్ కాస్త ఆలస్యమైంది అని అన్నారు.