Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10.. ఒకప్పటి హీరో, కమెడియన్ ఫిక్స్..
తాజాగా మరో పేరు కూడా వినిపిస్తుంది. (Bigg Boss Telugu 10)
Bigg Boss Telugu 10
Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మరో మూడు రోజుల్లో మొదలు కాబోతుంది. దీంతో ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి ఉండే సెలబ్రిటీలు ఎవరు అని చర్చ జరుగుతుంది. ఇప్పటికే అగ్నిపరీక్షతో నలుగురు సామాన్యులను ఫైనల్ చేసినట్టు సమాచారం. అయితే ఈ సారి బిగ్ బాస్ లో ఉండే సెలబ్రిటీలలో.. సీరియల్ నటీమణులు పల్లవి గౌడ, తేజస్విని, కావ్యశ్రీ, కమెడియన్ ఎక్స్ప్రెస్ హరి, ఆటో రామ్ ప్రసాద్, నూకరాజు, రాకింగ్ రాకేశ్, డ్యాన్సర్ ఆట సందీప్ భార్య జ్యోతి, యూట్యూబర్ నందూ, టెంపర్ వంశీ.. పలువురు పేర్లు వినిపిస్తున్నాయి.
తాజాగా మరో పేరు కూడా వినిపిస్తుంది. ఒకప్పుడు కమెడియన్ గా, హీరోగా చేసిన కృష్ణుడు బిగ్ బాస్ ఎంట్రీ ఫిక్స్ అని సమాచారం. తాజాగా కృష్ణుడు తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలకు కింద కామెంట్స్ లో పలువురు బిగ్ బాస్ లో ధైర్యంగా ఉండు సపోర్ట్ చేస్తాం అని కామెంట్స్ పెట్టడం, కృష్ణుడు దానికి రిప్లైలు ఇవ్వడంతో కృష్ణుడు కూడా బిగ్ బాస్ 10 లో ఫిక్స్ అని తెలుస్తుంది.
2005లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన కృష్ణుడు హ్యాపీ డేస్ సినిమాతో ఫేమ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు అనే సినిమాలతో హీరోగా కూడా సక్సెస్ కొట్టాడు. కొన్నాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసి 2019 నుంచి సినిమాలకు దూరమయ్యాడు కృష్ణుడు. మళ్ళీ 2024 నుంచి అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల లగ్గం, గేమ్ ఛేంజర్, షణ్ముఖ, బ్యాడ్ బాయ్ కార్తీక్.. లాంటి పలు సినిమాల్లో నటించాడు. గతంలో కృష్ణుడు వైసీపీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
