ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా అలరించిన అందాల నటి జయలలిత. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో దాదాపు 140కి పైగా సినిమాలు చేసింది. జయలలిత దాదాపు 14 సంవత్సరాలకి పైగా తమిళనాడు ముఖ్యమంత్రి బాధ్యతలని నిర్వర్తించింది. ఇప్పుడు ఆమె బయోపిక్ లో రమ్యకృష్ణ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఒక బయోపిక్ లో కంగనా, మరో బయోపిక్ లో నిత్యామీనన్ నటిస్తున్నారు.
ఈ క్రమంలో జయలలిత జీవిత చరిత్రను క్వీన్ టైటిల్ తో వెబ్ సిరీస్ గా అందించడానికి దర్శకుడు గౌతమ్ మీనన్ తొలి ప్రయత్నం చేశాడు. ఆల్రెడీ ఈ వెబ్ సిరీస్ షూటింగు మొదలైపోయింది. ఈ వెబ్ సిరీస్ లో జయలలితగా రమ్యకృష్ణ నటిస్తోంది.
ఇక ఈ వెబ్ సిరీస్ నుంచి రమ్యకృష్ణ ఫస్టులుక్ ను విడుదల చేశారు. జయలలితగా ఆమె ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తున్నట్టుగా ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ విడుదల తేదీని ప్రకటించనున్నారు.