జయలలిత బయోపిక్ ‘తలైవి’ ప్రారంభం

కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌ ‘త‌లైవి’ షూటింగ్ ప్రారంభం..

  • Publish Date - November 11, 2019 / 05:05 AM IST

కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌ ‘త‌లైవి’ షూటింగ్ ప్రారంభం..

సినిమా పరిశ్రమలో గతకొద్ది కాలంగా రీమేక్స్, బయోపిక్స్ ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పటికే పలు రంగాలకు చెందిన ప్రముఖుల బయోపిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.. మరి కొన్ని సెట్స్‌పై ఉన్నాయి. తమిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌ను తెరకెక్కించడానికి గతకొద్ది రోజులుగా కొందరు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 
తెలుగు నిర్మాత విష్ణు ఇందూరి జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌ను ‘త‌లైవి’ పేరుతో రూపొందించ‌నున్న సంగ‌తి తెలిసిందే.

తెలుగు, త‌మిళ‌, హిందీ బాష‌ల్లో ప్రతిష్టాత్మ‌కంగా రూపొందుతున్న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఆదివారం చెన్నైలో ప్రారంభ‌మైంది. బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. లెజెండరీ త‌మిళ‌నాడు దివంగ‌త రాజ‌కీయ నాయ‌కుడు ఎం.జి.రామ‌చంద్ర‌న్(ఎంజీఆర్‌) పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు అర‌వింద‌స్వామి న‌టిస్తున్నారు.

Read Also : ‘ఆకాశం నీ హద్దురా’ – ఫస్ట్‌లుక్

ఎ.ఎల్‌.విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్‌.సింగ్ నిర్మిస్తున్నారు. ‘బ్లేడ్ ర‌న్న‌ర్‌’, ‘కెప్టెన్ మార్వెల్’ వంటి హాలీవుడ్ చిత్రాల్లో వ‌ర్క్ చేసిన ప్ర‌ముఖ హాలీవుడ్ మేక‌ప్ ఆర్టిస్ట్ కంగ‌నా ర‌నౌత్‌ను ప్రత్యేక మేకప్‌తో జ‌య‌ల‌లిత‌గా చూపిస్తున్నారు.. ఈ సినిమా కోసం కంగనా భరతనాట్యంలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటుంది. విశాల్ విట్టల్ సినిమాటోగ్రఫీ, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతమందిస్తున్నారు.