Jayam Ravi : చోరీకి పాల్ప‌డ్డార‌ని ఆరోప‌ణ‌.. ప‌ని మ‌నుషుల‌ను ఇంట్లో బంధించిన హీరో జ‌యం ర‌వి

తమిళ స్టార్ హీరో జ‌యం ర‌వి (Jayam Ravi ) అలియాస్ ర‌విమోహ‌న్ మ‌రో వివాదంలో చిక్కుకున్నాడు.

Jayam Ravi Accused of Detaining Maids Over Theft Suspicion

Jayam Ravi : తమిళ స్టార్ హీరో జ‌యం ర‌వి అలియాస్ ర‌విమోహ‌న్ మ‌రో వివాదంలో చిక్కుకున్నాడు. త‌న ఇంట్లో ప‌ని చేస్తున్న ఇద్ద‌రు మ‌హిళ‌ల‌తో పాటు ఓ బాలుడిని నిర్భందించిన‌ట్లు స‌మాచారం. బాధితుల కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఈ ఘ‌ట‌న విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

చెన్నైలోని నీలాంకరైలో న‌టుడు జ‌యం ర‌వి నివాసం ఉంటున్నాడు. త‌న ఇంట్లో దొంగ‌త‌నానికి పాల్ప‌డ్డార‌ని ఆరోపిస్తూ త‌న ఇంట్లో ప‌ని చేస్తున్న ఇద్ద‌రు మ‌హిళ‌ల‌తో పాటు ఓ బాలుడిని నిర్భందించారు. కార్మికులు ఇంటికి రాక‌పోవ‌డంతో వారి కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న చెందారు. వారిలో ఒక‌రు న‌టుడి ఇంటికి వెళ్లగా బంధించిన‌ట్లు తెలుసుకున్నారు. వాళ్ల‌ను పంపించాల‌ని కోర‌గా అందుకు న‌టుడు నిరాక‌రించాడు.

Sardar 2 : కార్తి ‘స‌ర్దార్ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్‌.. ఏ రోజున అంటే?

దీంతో స‌ద‌రు వ్యక్తి న‌టుడిపై నీలాంగ‌రై పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్క‌డ‌కు వ‌చ్చి మ‌హిళ‌ల‌ను బంధించ‌డం స‌రికాద‌ని హిత‌వు ప‌లికి వారికి విడిపించారు. చోరీ విష‌య‌మై ఫిర్యాదు చేయాల‌ని న‌టుడికి సూచించారు.

అయితే ఈ ఆరోపణలను నటుడు రవి మోహన్ తరఫు ప్రతినిధులు ఖండించారు. వారి వాదన ప్రకారం.. ఇంట్లో పని చేస్తున్న సిబ్బంది న‌గ‌దు, న‌గ‌ల‌ను దొంగిలించార‌నే అనుమానాలు ఉన్నాయ‌న్నారు. ఆ కారణంగానే వారిని ప్రశ్నించారని, ఎలాంటి అక్రమ నిర్బంధం జరగలేదని స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలు దర్యాప్తు అనంతరం మాత్రమే బయటపడతాయని పేర్కొన్నారు.

Ritu Varma : చీర‌లో తెలుగు అందం.. పాల‌రాతి బొమ్మ‌లా మెరిసిపోతున్న రీతూవ‌ర్మ‌

ఇప్పటికే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాలతో వార్తల్లో నిలిచిన రవి మోహన్ పేరు మరోసారి చర్చకు వచ్చింది. ఈ కేసులో వాస్తవ పరిస్థితులు ఏమిటి? ఆరోపణలు ఎంతవరకు నిజమన్నది పోలీసుల దర్యాప్తు నివేదిక తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.