నెలకు రూ.40 లక్షల భరణం ఇస్తే విడాకులకు ఓకే.. జయం రవి భార్య డిమాండ్..

గత రెండేళ్లుగా కోర్టులో ఈ కేసు నడుస్తుంది. (Jayam Ravi)

  • Updated on- May 19, 2026 / 03:10 PM IST

Jayam Ravi

Jayam Ravi : తమిళ్ స్టార్ హీరో జయం రవి – అతని భార్య ఆర్తి విడిపోతున్నట్టు 2024 లోనే ప్రకటించారు. అప్పట్లో జయం రవి తన భార్య తన డబ్బులు తీసేసుకుంది, తన పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టిందని, పిల్లలను దూరం చేసిందని సంచలన ఆరోపణలు చేసాడు. ఆర్తి ఏమో రవి వేరే అమ్మాయితో(సింగర్ కెనిషా) ఉంటున్నాడు అని ఆరోపణలు చేసింది.

గత రెండేళ్లుగా కోర్టులో ఈ కేసు నడుస్తుంది. ఇటీవల కెనిషా తనపై చేయిస్తున్న ట్రోల్స్ తట్టుకోలేక ఆర్తిపై సంచలన ఆరోపణలు చేస్తూ రవిని, చెన్నై ని వదిలి వెళ్ళిపోతున్నాను అని తెలిపింది. దాంతో రవి ప్రెస్ మీట్ పెట్టి భార్యపై సంచలన ఆరోపణలు చేసాడు. ఆల్రెడీ తన బ్యాక్ అకౌంట్స్, ఆస్తి, ఇల్లు లాగేసుకుంది, పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టిందని, పిల్లలను దూరం చేసిందని, తనపై చేతబడి చేయించిందని ఆరోపణలు చేస్తూ ఎమోషనల్ అయ్యాడు. అంతేకాక విడాకులు వచ్చేంతవరకు సినిమాలు కూడా చేయనున్నాడు.

Also Read : Renu Desai : రోడ్లన్నీ తవ్వేస్తారు.. అకిరాకు చెయ్యి విరిగింది.. ఫైర్ అయిన రేణు దేశాయ్..

తాజా తమిళ మీడియా సమాచారం ప్రకారం కోర్టులో ఈ కేసు నడుస్తుండగా రవికి విడాకులు ఇవ్వాలంటే నెలకు 40 లక్షలు భరణం కావాలని ఆర్తి కోరినట్టు తెలుస్తుంది. చెన్నై ఫ్యామిలీ కోర్టులో ఆర్తి ఈ విషయాన్ని తెలిపిందట. విడాకుల కేసులో మా ఇద్దరి మధ్యలోకి ఇంకొక వ్యక్తి వచ్చి మా బంధాన్ని బ్రేక్ చేసారని కేసులో పేర్కొంది ఆర్తి. రవి అయితే రాజీ పడటం మాత్రం కుదరదు అని, విడాకులు కావాల్సిందే అని పట్టుబట్టాడు.

అయితే ఆర్తి 40 లక్షలు భరణం అడగడంపై విమర్శలు వస్తున్నాయి. ఆర్తికి ఆల్రెడీ కోట్ల ఆస్తి ఉందని సమాచారం. తన తండ్రి తరపున వ్యాపారాలు చూసుకుంటుంది. మరో వైపు జయం రవి.. ఆర్తి తన ఇల్లు, డబ్బులు లాగేసుకుంది అని ఆరోపణలు చేసాడు.