JD Chakravarthy : చేతబడి చేయబోతున్న జేడీ చక్రవర్తి.. పాన్ ఇండియా వైడ్..
ఈ సినిమాలో జేడీ హీరోగా, విలన్‌గా కనిపించబోతున్నారు. (JD Chakravarthy)
- Saketh U
- Published on- April 17, 2026 / 05:43 PM IST
JD Chakravarthy
JD Chakravarthy : ఒకప్పుడు హీరోగా, విలన్ గా, కీలక పాత్రల్లో మెప్పించిన జేడీ చక్రవర్తి ఇటీవల మల్లె రీ ఎంట్రీలో వరుసగా సిరీస్ లు, సినిమాలు చాగేస్తున్నాడు. జేడీ చక్రవర్తి మెయిన్ లీడ్ లో ఓ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ‘చేతబడి’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. M3 మీడియా, మహా మూవీస్ బ్యానర్స్ పై మహర్షి కూండ్ల సమర్పణలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మాణంలో సూర్యాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా బాణామతి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా హారర్, మిస్టరీ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేలా ఉండనుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి కోడి తలతో ఉన్న ప్రీ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచారు. ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో జేడీ హీరోగా, విలన్‌గా రెండు వేరియేషన్స్ లో కనిపించబోతున్నాడని సమాచారం.
Also Read : Pochamma : ‘పోచమ్మ’ వెబ్ సిరీస్ రివ్యూ.. ఆహా ఓటీటీలో కొత్త సిరీస్..
త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. తాజాగా ఈ సినిమా ఐదు భాషల ఆడియో రైట్స్‌ను సరిగమ సంస్థ దక్కించుకుంది. ఒక పాటను ఐదు భాషల్లో విడుదల చేయడం కామన్‌గా జరుగుతుంది. కానీ ఇందులో తెలుగులో ఒక పాట, మిగిలిన భాషల్లో డిఫరెంట్ సాంగ్స్, సేమ్ విజువల్‌తో రావడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ సినిమాతో జేడీ మరోసారి పాన్ ఇండియా వైడ్ హంగామా చేయనున్నాడు.
