Jersey : జెర్సీ సినిమా వెంకటేష్ చేయాల్సిందట.. ఆయన కోసం రాసిన కథని నాని..

రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెంకటేష్, నానికి కూడా తెలియని ఓ విషయాన్ని బయటపెట్టారు. నాని నటించిన జెర్సీ సినిమా వెంకటేష్ చేయాల్సిందట.

Jersey story is written for Venkatesh but later nani come to this

Jersey : నేచురల్ స్టార్ నాని ఫాదర్ సెంటిమెంట్ తో ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చిన సినిమా ‘జెర్సీ’. ఫాదర్ అండ్ సన్ బాండింగ్ తో ఆడియన్స్ ని ఎమోషనల్ చేసిన నాని.. ఇప్పుడు మరోసారి ‘హాయ్ నాన్న’తో ఎమోషనల్ చేయడానికి వస్తున్నారు. అయితే ఈసారి ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ తో వస్తున్నారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న నాని వరుస ఇంటర్వ్యూలు చేస్తూ వస్తున్నారు. ఇటీవల యానిమల్ మూవీ డైరెక్టర్ సందీప్ వంగతో ఇంటర్వ్యూ చేసిన నాని.. తాజాగా ‘సైంధవ్’ హీరో వెంకటేష్ తో ఇంటర్వ్యూ చేశారు.

సైంధవ్ సినిమా కూడా ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ తోనే ఆడియన్స్ ముందుకు వస్తుంది. ఇక ఈ రీసెంట్ ఇంటర్వ్యూలో వెంకటేష్, నానికి కూడా తెలియని ఓ విషయాన్ని బయటపెట్టారు. నాని నటించిన జెర్సీ సినిమా వెంకటేష్ చేయాల్సిందట. ఆ కథ కూడా ఆయన కోసమే రాశారట. కానీ ఎందుకో అది సెట్ అవ్వలేదట. ఈ విషయం వెంకటేష్ చెప్పేవరకు నాని కూడా తెలియదు. జెర్సీ సినిమా క్రికెట్ బ్యాక్‌గ్రౌండ్ తో తెరకెక్కింది. వెంకటేష్ క్రికెట్ ప్లేయర్ అని అందరికి తెలిసిందే. ఆ సినిమాని నాని బాగా చేశారు. ఒకవేళ వెంకటేష్ చేసినా బాగుండేదని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also read : Animal Collections : వీక్ డేలో కూడా హాఫ్ సెంచరీ పై కలెక్షన్స్.. బాక్సాఫీస్‌పై యానిమల్ పంజా..

ఇక హాయ్ నాన్న విషయానికి వస్తే.. కొత్త దర్శకుడు శౌర్యువ్‌ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంటే శృతిహాసన్ ప్రత్యేక పాటలో కనిపించబోతున్నారు. డిసెంబర్ 7న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. ‘సైంధవ్‌’ విషయానికి వస్తే.. వెంకటేష్ 75వ చిత్రంగా వస్తున్న ఈ మూవీని శైలేష్‌ కొలను డైరెక్ట్ చేస్తున్నారు. నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా.. తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ జనవరి 13న సంక్రాంతి కానుకగా రాబోతుంది.

ట్రెండింగ్ వార్తలు