×
Ad

Bigg Boss 5 : హౌస్ నుంచి జెస్సి అవుట్.. ఈ సారి కన్ఫర్మ్..

నిన్నటి వీకెండ్ ఎపిసోడ్ లో జెస్సిని పూర్తిగా ఇంటి నుంచి పంపించినట్టు తెలుస్తుంది. చికిత్స అందించినా అతని ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో బిగ్‌బాస్‌ జెస్సీని హౌస్‌ నుంచి బయటకు

  • Published On : November 14, 2021 / 09:52 AM IST

Jessi

Bigg Boss 5 :  ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 5 నుంచి 9 మంది ఎలిమినేట్ అయ్యారు. అయితే 10వ వారం ఎలిమినేషన్ లేకుండానే ఓ కంటెస్టెంట్ బయటకి వెళ్ళిపోయాడు. గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ లో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జెస్సీ హౌస్‌ నుంచి బయటకు వచ్చేశాడు. జెస్సి ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండగా చికిత్స అందించినా మరోసారి అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతన్ని బయటకి పంపించారని చెప్పి సీక్రెట్‌ రూంలో ఉంచి చికిత్స అందించారు.

Bigg Boss 5 : మరోసారి సన్నీపై ఫైర్ అయిన నాగార్జున

నిన్నటి వీకెండ్ ఎపిసోడ్ లో జెస్సిని పూర్తిగా ఇంటి నుంచి పంపించినట్టు తెలుస్తుంది. చికిత్స అందించినా అతని ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో బిగ్‌బాస్‌ జెస్సీని హౌస్‌ నుంచి బయటకు వెళ్లిపొమ్మని చెప్పాడు. ఇందుకు జెస్సి బిగ్ బాస్ కి థ్యాంక్స్ కూడా చెప్పాడు. గత బిగ్ బాస్ సీజన్స్ లో కూడా సంపూర్ణేష్ బాబు, గంగ‌వ్వ‌, నోయ‌ల్ ఇలా ఆరోగ్య సమస్యలతో గేమ్ మ‌ధ్య నుంచి బ‌య‌ట‌కు వచ్చేసారు. తాజాగా ఈ సీజన్ లో జెస్సీ కూడా బయటకి వచ్చేశాడు. దీంతో ఈ వారం ఎలిమినేషన్ లేకుండానే కంటెస్టెంట్ బయటకి వచ్చారు. జెస్సి బయటకి వచ్చేయడంతో నామినేషన్ లో ఉన్న మిగిలిన కంటెస్టెంట్స్ సేఫ్ అయ్యి రిలాక్స్ అయ్యారు.