Jivitha Rajashekhar
Jivitha Rajashekhar : ‘మా’ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. రెండు ప్యానెళ్ల సభ్యులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మరోవైపు ప్రచారం కూడా జోరుగా చేస్తున్నారు. ఇరు ప్యానెళ్ల సభ్యులు సినీ పరిశ్రమకు చెందిన పెద్దలను కలుస్తూ మద్దతు కూడగడుతున్నారు. ప్రెస్ మీట్లు పెడుతూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఎన్నికలను ఉద్దేశించి జీవిత రాజశేఖర్ సోమవారం మీడియాతో మాట్లాడారు. ఒక లేడీని పట్టుకుని టార్గెట్ చేస్తున్నారని జీవితా రాజశేఖర్ వాపోయారు.
Read More : Annaatthe : రజినీ కోసం బాలు పాడిన చివరి సాంగ్ ఇదే..
ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. గత రెండేళ్లలో మాలో అభివృద్ధి అనేదే లేదని.. అన్ని పనులు వాయిదాల పర్వంలా కొనసాగుతున్నాయని ఇలా కావడానికి నరేష్ కారణమని తెలిపారు. మంచి చేసేందుకు వెళ్తే తామే చెడు అయ్యామని వాపోయారు. డైరీ విడుదల కార్యక్రమం నుంచి తమ మధ్య విభేదాలు వచ్చాయన్నారు. గత ‘మా’ ఎన్నికల్లో నరేష్ మాటల్ని నమ్మి తప్పుచేశాం అని, ఆయన చెప్పింది ఒక్కటి కూడా జరగలేదని పేర్కొన్నారు. మా ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా సాగాలని కోరారామే
Read More : Gold Imports : వామ్మో… ఏకంగా 91 టన్నులే.. భారీగా పెరిగిన బంగారం దిగుమతులు