×
Ad

Peddi: పెద్ది సినిమా కోసం చరణ్ కష్టం.. జానీ మాస్టర్ పోస్ట్ వైరల్.. హ్యాపీగా ఫీలవుతున్న మెగా ఫ్యాన్స్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న మూవీ పెద్ది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను(Peddi) దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్నాడు.

Johnny Master post about ram charan Peddi is going viral on social media

Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న మూవీ పెద్ది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్నాడు. పెద్ది సినిమా కోసం చరణ్ కష్టం.. జానీ మాస్టర్ పోస్ట్ వైరల్.. హ్యాపీగా ఫీలవుతున్న మెగా ఫ్యాన్స్రూరల్ బ్యాక్డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో, మరీ ముఖ్యంగా(Peddi) మెగా ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక గేమ్ ఛేంజర్ సినిమా డిజాస్టర్ అవడంతో రామ్ చరణ్ కూడా పెద్ది విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా తన ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా చేయాలని చూస్తున్నాడు.

Baahubali The Epic: రూ.1000 కోట్ల పోస్టర్ పై అనుమానాలు.. తగ్గేదేలే అన్న కార్తికేయ.. తరువాత చూసి షాక్ అయ్యాం..

చాలా రిస్కీ షాట్స్ కూడా చేస్తున్నాడు. ఇటీవల ఒక సాంగ్ షూట్ కోసం కొండా అంచున చెట్టుపై చేసిన డాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ సమయంలో ఒక సినిమా కోసం ఇంత రిక్స్ షాట్స్ చేయడం అవసరమా అంటూ కామెంట్స్ కూడా వినిపించాయి. ఇక తాజాగా ఈ సినిమా కోసం రామ్ చరణ్ పడుతున్న కష్టం గురించి డాన్స్ మాస్టర్ జానీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇటీవల సాంగ్ షూట్ కోసం శ్రీలంక వెళ్ళింది పెద్ది టీం. ఈ సాంగ్ ను జానీ కొరియోగ్రఫీ చేస్తున్నాడు. ఆ సమయంలో రామ్ చరణ్ పడిన కష్టాన్ని దగ్గరనుంచి చూసిన జానీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు.

“నేను అమితంగా అభిమానించే వ్యక్తి రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు తో పని చేయడం ఆనందంగా ఉంది. పెద్ది సినిమా కోసం చరణ్ అన్న పడుతున్న కష్టం నిజంగా అద్భుతం. రేపు మీరు సినిమాలో చూస్తారు” అంటూ రాసుకోచ్చాడు. అలాగే, రామ్ చరణ్, బుచ్చిబాబు, తన భార్యతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు జానీ మాస్టర్. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ పోస్ట్ చూసిన మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెద్ది సినిమా ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక పెద్ది సినిమా 2026 మర్చి 26న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది.