Baahubali The Epic: రూ.1000 కోట్ల పోస్టర్ పై అనుమానాలు.. తగ్గేదేలే అన్న కార్తికేయ.. తరువాత చూసి షాక్ అయ్యాం..
బాహుబలి ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. (Baahubali The Epic)ఇండియా సినిమా స్థాయిని ప్రపంచపటంలో నిలబెట్టింది ఈ సినిమా. ఆ ఒక్క విషయంలోనే కాదు చాలా విషయాల్లో బాహుబలి అనేది ఒక బెంచ్ మార్క్ అనే చెప్పాలి.
Director Rajamouli makes interesting comments on Baahubali Rs. 1000 crore poster
Baahubali The Epic: బాహుబలి ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండియా సినిమా స్థాయిని ప్రపంచపటంలో నిలబెట్టింది ఈ సినిమా. ఆ ఒక్క విషయంలోనే కాదు చాలా విషయాల్లో బాహుబలి అనేది ఒక బెంచ్ మార్క్ అనే చెప్పాలి. ఒక రీజనల్ సినిమాను హాలీవుడ్ స్థాయిలో ఎలా నిలబెట్టాలి అనే విషయంలి కూడా బాహుబలి అనేది పెర్ఫెక్ర్ ఎగ్జామ్పుల్. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా మొదటి భాగం రూ.700 కోట్లు కొల్లగొట్టగా.. రెండవ భాగం ఏకంగా (Baahubali The Epic)రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ రెండు భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో మళ్ళీ విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమా అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Anupama: అనుపమకు యాక్టింగ్ రాదు.. మొదటి సినిమాకే దారుణమైన ట్రోలింగ్.. ఆ సమయంలో నేను..
అయితే, ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాహుబలి పిల్లర్స్ అయిన రాజమౌళి, ప్రభాస్, రానా ఈ సినిమా గురించి మాట్లాడుకున్న విశేషాలతో ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో బాహుబలి, బాహుబలి 2 సినిమాల గురించి ఆడియన్స్ కి తెలియని చాలా విషయాలు చెప్పుకొచ్చారు. అందులో, బాహుబలి 2 రూ.1000 కోట్ల పోస్టర్ విడుదల చేసినప్పుడు జరిగిన ఒక ఆసక్తికర సంఘటన గురించి చెప్పుకొచ్చారు. బాహుబలి 2 చిత్రికరణ సమయంలో రెండు కలర్ డ్రెస్ లో ప్రభాస్ ఫోటోలను సరదాగా తీయించాడట రాజమౌళి. కట్టి పట్టుకొని ప్రభాస్ అలా కూర్చొని ఉన్న ఆ ఫోటో చాలా రాజసంగా ఉంటుంది. ఆ ఫోటో టీం అందరికి చాలా నచ్చిందట.
అప్పటినుంచి ఈ ఫోటోను ఎక్కడ వాడదాం అని చాలా ఆలోచించారట. అదే సమయంలో బాహుబలి 2 సినిమా రూ.1000 కోట్ల ,మార్క్ ను దాటడం జరిగిందట. కానీ, ఆ పోస్టర్ కోసం ఈ ఫోటోను వాడితే కొంచం అతిగా వుంతుందోమో అని రాజమౌళి, ప్రభాస్ అనుకున్నారట. కానీ, రాజమౌళి కొడుకు కార్తికేయ మాత్రం ఏమాత్రం తగ్గలేదట. రూ.1000 కోట్లకు ఆ ఫొటోతో ఉన్న పోస్టర్ నే విడుదల చేయాలనీ పట్టుబట్టాడట. టీం కూడా కె చేయడంతో రూ.1000 కోట్ల పోస్టర్ అదే ఫొటోతో విడుదల అయ్యింది. ఆడియన్స్ నుంచి కూడా ఆ పోస్టర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి చాలా ఆసక్తికర విషయాల గురించి ఈ వీడియోలో చర్చించుకున్నారు.
