Anupama: అనుపమకు యాక్టింగ్ రాదు.. మొదటి సినిమాకే దారుణమైన ట్రోలింగ్.. ఆ సమయంలో నేను..
మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరంలేదు(Anupama). అవడానికి మలయాళ బ్యూటీ అయినప్పటికీ తెలుగులోనే ఆమె మంచి క్రేజ్ తెచ్చుకుంది.
Anupama Parameswaran reacts emotionally to the trolling she received
Anupama: మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరంలేదు. అవడానికి మలయాళ బ్యూటీ అయినప్పటికీ తెలుగులోనే ఆమె మంచి క్రేజ్ తెచ్చుకుంది. అక్కడికంటే ఇక్కడే ఆమెకు ఎక్కువ అవకాశాలు వచ్చాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె నటించిన తొలి సినిమా ప్రేమమ్ ను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. మాతృకలో చేసిన అదే పాత్రను తెలుగు రీమేక్ లో కూడా చేసింది అనుపమ(Anupama). అలా టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత కూడా వరుస అవకాశాలను అందుకుంది.
Nithin-VI Anand: వీఐ ఆనంద్ తో నితిన్ కొత్త మూవీ.. ఇద్దరికీ అగ్నిపరీక్షనే.. కథ కొత్తగా..
ఇదిలా ఉంటే, తాజాగా ఆమె “బైసన్” సినిమా చేసింది. తమిళ స్టార్ విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ హీరోగా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించాడు. రూరల్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమ తన కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న ట్రోలింగ్ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేసింది.
ఈ సంధర్బంగా ఆమె మాట్లాడుతూ.. “నా తొలిచిత్రం ప్రేమమ్. ఈ సినిమా విడుదల తర్వాత నాపై వచ్చిన ట్రోలింగ్స్‌తో చూసి చాలా భయమేసింది. చాలా మంది నాకు నటనే రాదు అంటూ దారుణమైన కామెంట్స్ చేశారు. నా సొంత సినిమా ఇండస్ట్రీ నుంచే నేను విమర్శలు ఎదుర్కొన్నాను. కానీ, వాటిని ఎప్పుడు పట్టించుకోలేదు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నాను. ఇప్పుడు నన్ను నేను చూసుకొని గర్వపడుతున్నాను” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది అనుపమ. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
