Nithin-VI Anand: వీఐ ఆనంద్ తో నితిన్ కొత్త మూవీ.. ఇద్దరికీ అగ్నిపరీక్షనే.. కథ కొత్తగా..
నితిన్ టైం అస్సలు బాలేదు. వరుసగా ప్లాప్స్ ఇస్తూ వస్తున్నాడు. పాపం ఆ ఎఫెక్ట్ మాములుగా లేదు(Nithin-VI Anand). ఎంతలా అంటే, ఇప్పటికే ఓకే అయిన సినిమాల నుంచి కూడా తీసేస్తున్నారు.
Hero Nithiin to do a new film with director VI Anand
Nithin-VI Anand: నితిన్ టైం అస్సలు బాలేదు. వరుసగా ప్లాప్స్ ఇస్తూ వస్తున్నాడు. పాపం ఆ ఎఫెక్ట్ మాములుగా లేదు. ఎంతలా అంటే, ఇప్పటికే ఓకే అయిన సినిమాల నుంచి కూడా తీసేస్తున్నారు. అలా నితిన్ చేతిలో నుంచి ప్రెస్టీజియస్ “ఎల్లమ్మ” మూవీ జారిపోయింది. ఆ షాక్ నుంచి కోలుకునేలోపే దర్శకుడు విక్రం కె కుమార్ సినిమా కూడా క్యాన్సిల్ అయ్యింది. నిజానికి ఈ రెండు సినిమాలపై నితిన్ చాలా నమ్మకం పెట్టుకున్నాడు. ఆయన గత(Nithin-VI Anand) చిత్రాలు రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాల ప్రమోషన్స్ లో ఈ సినిమాల గురించి ఎక్కువగా చెప్పుకొచ్చాడు. కానీ, ఇప్పుడు ఆ రెండు సినిమాలు తన చేతిలో లేకుండా పోయాయి.
Shraddha Srinath: పింక్ శారీలో కాశ్మీర్ యాపిల్ లా.. అందంతో కట్టిపడేస్తున్న శ్రద్ధా శ్రీనాథ్.. ఫోటోలు
ఇక అప్పటినుంచి తన కంబ్యాక్ కోసం ఎలాంటి సినిమా చేయాలి, ఏ దర్శకుడితో చేయాలి అని ఆలోచిస్తున్నాడు నితిన్. సరిగ్గా అదే సమయంలో వినూత్న దర్శకుడు వీఐ ఆనంద్ టచ్ లోకి వచ్చాడట. రీసెంట్ గా ఈ దర్శకుడు చెప్పిన కథ నితిన్ కి ఒక రేంజ్ లో నచ్చేసిందట. నిజానికి వీఐ ఆనంద్ సినిమాలన్నీ చాలా వినూత్నంగా ఉంటాయి. తన గత చిత్రాలు ఎక్కడికి పోతావ్ చిన్నవాడా, ఒక్క క్షణం, డిస్కో రాజా, ఊరు పేరు భైరవకోన లాంటి సినిమాలు చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు మరోసారి అలాంటి సరికొత్త ప్రయత్నంతోనే నితిన్ ను మెప్పించాడట వీఐ ఆనంద్.
రెండు వింత ప్రపంచాల చుట్టూ ఈ కథ తిరుగుతుందట. నితిన్ కూడా రెండు వింత పాత్రల్లో(డ్యూయల్ రోల్) కనిపించబోతున్నాడట. చాలా కొత్తగా ఉందని ఈ కథని ఓకే చేశాడట నితిన్. భారీ గ్రాఫిక్స్ తో రానున్న ఈ సినిమాను స్వయంగా నితిన్ నిర్మిచబోతున్నాడని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన రానుంది. ఇక ఈ క్రేజీ ప్రాజెక్టు ఇటు దర్శకుడికి, నితిన్ కి అగ్ని పరీక్ష లాంటిది అనే చెప్పాలి. మరి ఆ పరీక్షను ఎంత వరకు వీరు ఛేదిస్తారు అనేది చూడాలి.
