‘జోక‌ర్’ ట్రైల‌ర్ చూశారా..?

  • Publish Date - April 4, 2019 / 09:26 AM IST

ఆస్కార్ నామినేట్ ఫిలిం మేక‌ర్ టాడ్ ఫిలిప్స్ ద‌ర్శ‌క‌త్వంలో జాక్విన్ పోనిక్స్ ప్ర‌ధాన పాత్ర‌ధారిగా తెర‌కెక్కుతున్న చిత్రం జోక‌ర్. ఈ ట్రైల‌ర్ బుదవారం (ఏప్రిల్ 3, 2019)న విడుద‌లైంది. కొద్ది క్షణాల్లోనే ఈ ట్రైలర్ చాలా వైరల్ కావ‌డంతో కోటికి పైగా వ్యూస్ రాబ‌ట్టింది. హాస్యనటుడు ఆర్థర్ ఫ్లేక్ యొక్క ట్విస్టెడ్ కథ నేప‌థ్యంలో జోక‌ర్ మూవీ సాగ‌నుంది.  

జోక‌ర్‌గా ఆర్థ‌ర్ ఫ్లేక్ పాత్ర‌లో జాక్విన్ న‌ట‌న అద్భుతంగా ఉంది. ఈ చిత్ర ట్రైల‌ర్ అభిమానుల‌ని మ‌రో లెవల్‌కి తీసుకెళుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. రాబ‌ర్ట్ ఫోనిక్స్, జాజీ బీట్జ్, ఫ్రాన్సెస్ కోన్రాయ్, మార్క్ మారోన్, బిల్ క్యాంప్‌, గ్లెన్ ఫ్లెష్ల‌ర్‌, షియా విగమ్, బ్రెట్ క‌ల్లెన్‌, డ‌గ్ల‌స్ హోడ్జ్‌, జోష్ పారిస్ ముఖ్య పాత్ర‌ల‌లో న‌టించారు. అంతేకాదు ఈ చిత్రం అక్టోబ‌ర్ 4న  ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.