Jabardasth Mahidhar : జబర్దస్త్ లో క్యాస్ట్ ఫీలింగ్.. టీమ్ లీడర్ అయినా సపోర్ట్ లేదు.. అందరి ముందు మొహం మీదే.. సంచలన వ్యాఖ్యలు..
జబర్దస్త్ మహీధర్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసాడు. (Jabardasth Mahidhar)

Jabardasth Mahidhar
Jabardasth Mahidhar : జబర్దస్త్ కామెడీ షోతో ఎంతోమంది కమెడియన్స్, నటీనటులు పరిశ్రమకు పరిచయమయ్యారు. చాలా మంది ఈ షోతో స్టార్స్ అయ్యారు. కొంతమంది ఈ షోని వదిలేసి వెళ్లిపోయారు కూడా. అలాంటి వాళ్ళల్లో ఒకరు మహీధర్. జబర్దస్ లో ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి టీమ్ లీడర్ గా ఎదిగాడు మహీధర్. కానీ తర్వాత జబర్దస్త్ పలు కారణాలతో మానేసాడు. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని రివ్యూలు, ఇంటర్వ్యూలు చేసుకుంటున్నాడు.(Jabardasth Mahidhar)
తాజాగా జబర్దస్త్ మహీధర్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జబర్దస్త్ గురించి, అక్కడ ఉన్న వాళ్ళ గురించి సంచలన వ్యాఖ్యలు చేసాడు.
మహీధర్ మాట్లాడుతూ.. నేను జబర్దస్త్ కోసమే హైదరాబాద్ కి వచ్చాను. చాలా కష్టాలు పడి జబర్దస్ లోకి ఎంటర్ అయ్యాను. కిరాక్ ఆర్పీ వెళ్ళాక నాకు టీమ్ లీడర్ వచ్చింది. 18 స్కిట్స్ చేశాను లీడర్ గా. కరోనాతో నా టీమ్ లీడర్ పోయింది. తర్వాత ఆర్టిస్ట్ గా కూడా కొన్ని స్కిట్స్ చేశాను. కానీ తర్వాత కొన్ని బ్యాడ్ అనుభవాలు ఎదురయ్యాయి. టీమ్ లీడర్ తీసేసిన తర్వాత చంటి అన్న టీమ్ లో ఆర్టిస్ట్ గా వేశారు. అక్కడ నాకు సరైన క్యారెక్టర్స్ ఇవ్వలేదు. గుంపులో గోవింద అన్నట్టు క్యారెక్టర్ ఇచ్చారు. నాకు అప్పటికే టీమ్ లీడర్ చేసిన అనుభవం కూడా ఉంది.
నాకు అది నచ్చకపోవడంతో డైరెక్టర్స్ కి చెప్తే తాగుబోతు రమేష్ అన్న టీమ్ లో వేశారు. రమేష్ దాంట్లో వేస్తే రెండు స్కిట్స్ అవ్వగానే ఒక రోజు ప్రాక్టీస్ కి వెళ్తే నిన్ను తీసేసాం తెలీదా, నీకు చెప్పలేదా అన్నాడు. నేను వెళ్లి డైరెక్షన్ టీమ్ ని అడిగితే నీకు చెప్పలేదు, నువ్వేమి పట్టించుకోవు, ఫీల్ అవ్వవు అని చెప్పలేదు అన్నారు. నాకు బాధేసి వెళ్ళిపోయాను. అప్పుడు జబర్దస్త్ అది నా ప్లేస్ కాదు అనిపించింది. అంతమంది ముందు మొహం మీదే నిన్ను తీసేసాం అంటే ఎలా ఉంటుంది. కనీసం ముందే చెప్తే ఆ షెడ్యూల్ కి వెళ్ళేవాడిని కాదు.
Also Read : Mahesh Babu : మహేష్ బాబు దెబ్బకి ఒక్కసారిగా భారీగా పెరిగిన సేల్స్.. ఇది కదా మహేష్ రేంజ్ అంటే..
నితిన్ భరత్ జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయాక తర్వాత డైరెక్టర్స్ సరిగ్గా పట్టించుకోలేదు. ఏదైనా అసిస్టెంట్ డైరెక్టర్స్ చూస్తారు. నాకు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. ఓ విషయంలో నాకు అసిస్టెంట్ డైరెక్టర్ కి గొడవ అయింది. అతను క్యాస్ట్ ఫీలింగ్ తో ఇంకో ఆర్టిస్ట్ ని సపోర్ట్ చేసాడు. అతనితో రోడ్ మీద గొడవ పడ్డాను. టీమ్ లీడర్ గా నన్ను అసలు పట్టించుకోలేదు అందుకే ఇవన్నీ ఆలోచించుకొని నేను జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయాను. మేనేజ్మెంట్ కి ఇవన్నీ చెప్పి టీమ్ లీడర్ ఇస్తే ఉంటాను లేకపోతే వెళ్ళిపోతాను అన్నాను, వాళ్ళు కుదరదు అనడంతో వెళ్ళిపోయాను అని తెలిపాడు. ప్రస్తుతం వైజాగ్ లోనే ఉంటూ యూట్యూబ్ వీడియోలు చేసుకుంటున్నాడు మహీధర్.