బాబాయ్‌కి ఛాలెంజ్ విసిరిన అబ్బాయ్..

‘బీ ద రియల్ మేన్’ ఛాలెంజ్‌‌లో బాబాయ్ బాలకృష్ణను నామినేట్ చేసిన తారక్..

‘బీ ద రియల్ మేన్’ ఛాలెంజ్‌‌లో బాబాయ్ బాలకృష్ణను నామినేట్ చేసిన తారక్..

యంగ్ డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా విసిరిన ‘బీ ద రియల్ మేన్’ ఛాలెంజ్‌ క్రమంగా పలువుర్ని ఆకట్టుకుంటోంది. రాజ‌మౌళికి తొలి ఛాలెంజ్ విసిరారు సందీప్‌. ఆయ‌న కూడా ఓకే చెప్పి బీ ద రియ‌ల్ మేన్ ఛాలెంజ్‌ను పూర్తి చేశారు. అంతే కాకుండా తార‌క్‌, చ‌ర‌ణ్‌ల‌తో పాటు ఎం.ఎం.కీరవాణి, శోభు యార్ల‌గ‌డ్డ‌, సుకుమార్‌ల‌కు ఛాలెంజ్ విసిరారు.

వీరిలో ముందుగా జ‌క్క‌న్న ఛాలెంజ్‌కు తార‌క్ ఓకే చెప్పడ‌మే కాకుండా పూర్తి చేశారు. ఇల్లు తుడ‌వ‌డం, గిన్నెలు బ‌ట్ట‌తో శుభ్రం చేయ‌డంతో పాటు గార్డెన్‌ను క్లీన్ చేశారు తార‌క్‌. ‘‘ప్రేమ, ఆప్యాయతలే కాదు..ఇంట్లోని పనులను కూడా పంచుకుందాం. అలా పంచుకుంటే వచ్చే సరదానే వేరు. బీ ద రియల్ మేన్.

బాల బాబాయ్, చిరంజీవి గారు, నాగార్జున బాబాయ్, వెంకటేశ్ గారు, కొరటాల శివగారిని నేను నామినేట్ చేస్తున్నా’’.. అంటూ వీడియోతో పాటు మెసేజ్‌ ట్వీట్ చేశారు తారక్. మరి ఈ స్టార్స్ బీ ద రియల్‌మేన్ ఛాలెంజ్‌లో ఎప్పుడు పాల్గొంటారో చూడాలి. ముఖ్యంగా నటసింహా నందమూరి బాలకృష్ణ ఈ ఛాలెంజ్‌ను ఎలా స్వీకరిస్తారని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.