Devara Trailer : ఎన్టీఆర్ ‘దేవర’ ట్రైలర్.. రక్తంతో సంద్రం ఎరుపెక్కిన కథ.. గూస్‌బంప్స్ అంతే..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర.
- Thota Vamshi Kumar
- Published On : September 10, 2024 / 05:06 PM IST
Jr Ntr Devara Trailer out now
Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్. సెప్టెంబర్ 27న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ బాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు ఆకట్టుకోగా తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు.
ట్రైలర్ నిడివి 2 నిమిషాల 40 సెకన్లు కాగా.. కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు, ధైర్యం తప్ప ఏమీ తెలియని వాళ్లకి మొదటి సారి భయం పొరలు కమ్ముకున్నాయి. అనే డైలాగ్‌తో ట్రైలర్ ఆరంభమైంది. యాక్షన్ సీక్వెన్స్, ఎన్టీఆర్ డైలాగులు అదరహో అనిపించేలా ఉన్నాయి. మొత్తంగా ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేసింది.
Bezawada Bebakka : అమెరికాలో కోటి రూపాయల జాబ్ వదులుకొని.. బిగ్ బాస్‌కి వచ్చిన బెజవాడ బేబక్క..
ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
