Devara Trailer date : ఎన్టీఆర్ ‘దేవ‌ర’ ట్రైల‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్‌?

జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న చిత్రం దేవ‌ర‌.

JR NTR Devaras Trailer date locked

Devara Trailer : జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న చిత్రం ‘దేవ‌ర‌’. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రెండు భాగాలుగా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. తొలి భాగం ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. జాన్వీక‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ మూవీని నందమూరి కల్యాణ్‌రామ్‌, సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ లు నిర్మిస్తున్నారు.

విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డ‌డంతో చిత్ర బృందం ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. ఇప్ప‌టికే మూడు పాట‌ల‌ను విడుద‌ల చేయ‌గా వాటికి మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ పాట‌ల‌తో సినిమాపై అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగాయి.

మోక్షజ్ఞ సినిమాలో ఎన్టీఆర్ రోల్ అదేనా? మూవీలో బాలకృష్ణ కూడా?

ఇదిలా ఉంటే.. ఈ చిత్ర ట్రైల‌ర్‌ను ఎప్పుడెప్పుడు విడుద‌ల చేస్తారా? అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఓ వార్త ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది.

దేవ‌ర మూవీ ట్రైల‌ర్‌ను ఈ నెల 10న విడుద‌ల చేసేందుకు చిత్ర బృందం స‌న్నాహ‌కాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ముందుగా థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌నున్నార‌ని, ట్రైల‌ర్ నిడివి దాదాపుగా 2 నిమిషాల 45 సెక‌న్లు ఉన్న‌ట్లు టాక్‌. అయితే.. ఈ తేదీపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ఈ మూవీలో బాలీవుడ్ న‌టుడు అలీ ఖాన్ విలన్‍గా న‌టిస్తున్నారు. బాబీ డియోల్, శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ చాకో, నరైన్, శృతి మరాథే లు కీల‌క పాత్ర‌ల‌ను పోషించ‌గా అనిరుధ్ సంగీతాన్ని అందించాడు.

Hero Raj Tarun : రాజ్ తరుణ్-లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్.. మాల్వితో రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు!

ట్రెండింగ్ వార్తలు