JR NTR : తొలిసారి కుకీస్ చేసిన ఎన్టీఆర్‌.. పంప‌మ‌ని అభిమాని అడిగితే.. షాకింగ్ రిప్లై..

జూనియ‌ర్ ఎన్టీఆర్ (JR NTR ) ఏ మాత్రం ఖాళీ దొరికినా కూడా కిచెన్‌లో చేరి వెరైటీ వంట‌కాల‌ను చేస్తుంటారు అన్న సంగ‌తి తెలిసిందే

Jr NTR Made Cookies and Fan Asked send two then actor Replay Goes Viral

JR NTR : జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉన్నారు. ఆయ‌న‌కు ఏ మాత్రం ఖాళీ దొరికినా కూడా కిచెన్‌లో చేరి వెరైటీ వంట‌కాల‌ను చేస్తుంటారు అన్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ చేసే బిర్యానీ, నాటుకోడి కూర‌కు ఇండ‌స్ట్రీలో సెప‌రేట్ ఫ్యాన్స్ బేసే ఉందంటే అతిశ‌యోక్తి కాదేమో. ఇక ఆయ‌న వెండితెర‌పైనే కాదు సోష‌ల్ మీడియాలోనూ త‌న‌దైన టైమింగ్‌తో ఫ్యాన్స్‌ను అల‌రిస్తుంటారు. అయితే.. ఆయ‌న సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండ‌డం, ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ను పంచుకోవ‌డం చాలా అరుదుగా చేస్తుంటారు.

తాజాగా ఎన్టీఆర్ తొలిసారి ఇంట్లో కుకీస్‌ను బేక్ చేశారు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. “My First Bake #BakedNotBought” అంటూ ఆ వీడియోకి క్యాప్ష‌న్ కూడా పెట్టారు. దీన్ని చూసిన సాయితేజ అనే అభిమాని.. అన్నా మా ఇంట్లో ఇద్ద‌రు చిన్న పిల్ల‌లు ఉన్నారు. మా కోసం ఓ రెండు కుకీలు పంపించ‌వా? అని అడిగాడు. ఇందుకు ఎన్టీఆర్ స్పందించిన విధానం ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది.

ప్ర‌ముఖ క‌మెడియ‌న్ బ్ర‌హ్మానంద పాపుల‌ర్ మీమ్ అయిన‌.. అడ్ర‌స్ పెట్టు.. ఫాస్ట్‌గా అడ్ర‌స్ పెట్టు అనే ఆడియోతో ఉన్న వీడియోను రిప్లైగా ఇచ్చాడు. అంతేకాదండోయ్ స‌ద‌రు అభిమానికి కుకీస్ సైతం పంపించి నిజంగానే స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు.

మ‌రోక అభిమాని.. బిర్యానీ, నాటు కోడి మీరు ఇలా కుకీస్ చేయ‌డం ఏంద‌న్నా అని అడ‌గ్గా.. ‘బాద్‌షా’ మూవీలోని బ్రహ్మానందం చెప్పిన ఫేమస్ డైలాగ్ “మారాయి.. అన్నీ మారాయి” అనే వీడియో క్లిప్‌ను షేర్ చేశాడు. ఇక ఎన్టీఆర్‌లోని కామెడీ టైమింగ్‌, ఆయ‌న హ్యుమ‌ర్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో డ్రాగ‌న్ మూవీని చేస్తున్నారు.