Ntr: ‘బ్రహ్మోత్సవం’ మూవీ ఎన్టీఆర్ చేయాల్సింది.. చివరి నిమిషంలో ఎం జరిగింది.. తారక్ చేసుంటే?
బ్రహ్మోత్సవం సినిమా కథను ముందుగా ఎన్టీఆర్(Ntr) కి వినిపించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.
- V Santhosh Kumar
- Updated on- May 8, 2026 / 07:22 AM IST
Jr NTR Rejected Mahesh Babu srikanth addala Brahmotsavam movie
- ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన బ్రహ్మోత్సవం కథ
- మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్
- సేఫ్ అయ్యాడు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్
Ntr: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో వదులుకున్న కథ మరొకరి దగ్గరకు వెళ్లడం, అది బ్లాక్‌బస్టర్ కావడమో లేక డిజాస్టర్‌గా మిగలడమో సహజంగా జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోలు కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, కొన్నిసార్లు వారి అంచనాలు పూర్తిగా తలకిందులవుతుంటాయి. అలా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన ఒక కథ, సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ఒక మాయని మచ్చగా, తీరని పీడకలగా మిగిలిపోయింది. అదే, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చేసిన, బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలమైన ‘బ్రహ్మోత్సవం’.
Simran: అక్కడ గౌరవం ఉండదు.. అంతా బేరాలే.. బాలీవుడ్ పరువు తీసిన సిమ్రాన్
నిజానికి, ‘బ్రహ్మోత్సవం’ కథను శ్రీకాంత్ అడ్డాల మొదట ఎన్టీఆర్(Ntr)కే వినిపించారట. ఆ స్టోరీ లైన్ తారక్‌కు కూడా బాగా నచ్చిందట. కానీ, స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేయాలని దర్శకుడు శ్రీకాంత్ అద్దాలకు సూచించాడట. దర్శకుడు కొత్త వెర్షన్‌తో మళ్ళీ వెళ్లినప్పటికీ, అది ఎన్టీఆర్‌ను సంతృప్తి పరచలేకపోయిందట. పైగా ఆ సమయంలో వరుస ఫ్లాపులతో ఉన్న తారక్, ప్రయోగాలు చేయడం ఇష్టం లేక ఈ ప్రాజెక్టును సున్నితంగా పక్కన పెట్టారని సమాచారం. దీంతో అప్పటికే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి క్లాసిక్ హిట్ ఇచ్చిన నమ్మకంతో మహేష్ బాబు ఈ కథను ఓకే చేశారు. ఫ్యామిలీ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయన్న నమ్మకంతో భారీ అంచనాలతో సెట్స్ పైకి తీసుకెళ్లారు.
అయితే, 2016లో విడుదలైన ఈ సినిమా అభిమానులను తీవ్ర నిరాశపరిచింది. అసలు మహేష్ బాబు లాంటి స్టార్ హీరో ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నాడో అర్థం కాక ఫ్యాన్స్ తలలు పట్టుకున్నారు. కనీస వసూళ్లను కూడా రాబట్టలేక డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలను మిగిల్చింది ఈ సినిమా. ఎన్టీఆర్ తన జడ్జిమెంట్‌తో సేఫ్ అవ్వగా, మహేష్ బాబు మాత్రం తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌ను మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ మహేష్ అభిమానులు ‘బ్రహ్మోత్సవం’ పేరు ఎత్తితేనే భయపడిపోయేంతగా ఆ సినిమా ప్రభావం చూపింది.
