Jr Soundarya : సౌందర్య మళ్లీ పుట్టిందా?జూనియర్ సౌందర్యను చూశారా!

జూనియర్ సౌందర్య వీడియోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి..

Jr Soundarya: ‘మహానటి’ సావిత్రి తర్వాత తెలుగులో అంతటి గుర్తింపు తెచ్చుకున్న, ప్రేక్షకులు అంతగా ఓన్ చేసుకున్న హీరోయిన్ సౌందర్య. స్టార్ హీరోలందరితో సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేశారామె. హీరోలకు సమానంగా ఇమేజ్ తెచ్చుకున్నారు సౌందర్య.

ఆడ, మగ, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ, అన్ని వయసుల వాళ్లు ఆమెను అభిమానించేవారు. ముఖ్యంగా మహిళల్లో సౌందర్యకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. సౌందర్య కట్టిన చీరలు, వేసిన డ్రెస్సుల వంటి వాటి కోసం చాలా ఆసక్తి చూపించేవారు.

RRR Glimpse : గ్లింప్స్ గూస్ బంప్స్..

ఆమె భౌతికంగా లేకపోయినా తన నటనతో జీవం పోసిన ఎన్నో క్యారెక్టర్ల రూపంలో మన కళ్లముందు కదలాడుతూనే ఉంటారు. సోషల్ మీడియాలో అచ్చు సౌందర్యలానే ఉన్న జూనియర్ సౌందర్య వీడియోలు ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. ఫస్ట్ టైం చూసినప్పుడు నిజంగా సౌందర్యేనేమో అనుకున్నవారు లేకపోలేదు.

Puneeth Rajkumar : పునీత్ సినిమా కోసం శివ రాజ్ కుమార్

అచ్చు సౌందర్య ముఖం, అలాంటి రూపు రేఖలతో ఉన్న ఈ సౌందర్య వీరాభిమాని పేరు చిత్ర.. టిక్ టాక్ చిత్రాజీ అనే పేరుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు భారీ సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. సౌందర్య లాంటి ఎక్స్‌ప్రెషన్లతో చిత్ర చేసే ఎమోషనల్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇన్‌స్టాలో chitra_jii2 ఈ ప్రొఫైల్ చూస్తే మళ్లీ సౌందర్యను చూసిన ఫీలింగ్ కలుగుతుంది.

ట్రెండింగ్ వార్తలు