Theatrical Releases : ఈ వారం థియేటర్స్‌లో రిలీజయ్యే తెలుగు సినిమాలు..

సంవత్సరంలో ఫస్ట్ హాఫ్ ముగిసింది. ఏ సంవత్సరం ఫస్ట్ హాఫ్ లో మంచి విజయాలే వచ్చాయి. పెద్ద, మీడియం సినిమాలు చాలా వరకు మెప్పించాయి. ఇక సెకండ్ హాఫ్ మొదలైంది. ఈ వారం తెలుగులో అన్ని మీడియం సినిమాలే రానున్నాయి.

July First Week Releases :  సంవత్సరంలో ఫస్ట్ హాఫ్ ముగిసింది. ఏ సంవత్సరం ఫస్ట్ హాఫ్ లో మంచి విజయాలే వచ్చాయి. పెద్ద, మీడియం సినిమాలు చాలా వరకు మెప్పించాయి. ఇక సెకండ్ హాఫ్ మొదలైంది. ఈ వారం తెలుగులో అన్ని మీడియం సినిమాలే రానున్నాయి.

నాగశౌర్య, యుక్తి తరేజా జంటగా పవన్ దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘రంగబలి’. కామెడీ, లవ్, మాస్ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. రంగబలి సినిమా జులై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

శ్రీ సింహ, నేహా సోలంకి జంటగా ప్రణీత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘భాగ్ సాలే’. ఓ వజ్రపు ఉంగరం కోసం జరిగే కథ అని సమాచారం. కామెడీ, సస్పెన్స్ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించగా జులై 7న రిలీజ్ అవ్వబోతుంది.

జగపతి బాబు, మమతా మోహన్ దాస్, విమలా రామన్, దివి ముఖ్య పాత్రలతో తెరకెక్కిన సినిమా ‘రుద్రంగి’. అజయ్ సామ్రాట్ దర్శకత్వంలో స్వతంత్రం ముందు రాజుల కాలం నాటి కథతో ఈ సినిమా తెరకెక్కినట్టు సమాచారం. ఈ సినిమా జులై 7న రిలీజ్ కాబోతుంది.

అర్జున్, జేడీ చక్రవర్తి మెయిన్ లీడ్స్ లో తెరకెక్కుతున్న ‘ఇద్దరు’ సినిమా కూడా జులై 7న రిలీజ్ అవుతుంది.

సాయి రోనాక్, రిచా పనయ్, ఆర్షిన్ మెహతా, బాబా భాస్కర్ మెయిన్ లీడ్స్ లో డైరెక్టర్ నీలకంఠ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సర్కిల్’. ఈ సినిమా జులై 7న థియేటర్స్ లో విడుదల కాబోతుంది.

ఆర్యన్ గౌరా, మిస్త్రీ చక్రవర్తి జంటగా దివ్య భావన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఓ సాథియా’. ఈ సినిమా జులై 7న రిలీజవుతుంది.

సాయి కుమార్, శ్రీనివాస్ సాయి, ఆదిత్య ఓం ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ‘నాతో నేను’ సినిమా జులై 7న రిలీజ్ కానుంది. ఈ సినిమాతో జబర్దస్త్ కమెడియన్ శాంతికుమార్ దర్శకుడిగా మారుతున్నాడు.

అలాగే ఈ వారం ‘మోహనకృష్ణ గ్యాంగ్ లీడర్’, ‘7 : 11pm’ అనే చిన్న సినిమాలు కూడా జులై 7న రిలీజవుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు