Chandrababu-NTR: ‘మావయ్య’ అంటూ ఆత్మీయంగా.. చంద్రబాబుకు బర్త్ డే విషెస్ తెలిపిన ఎన్టీఆర్

NTR wishes AP CM Chandrababu: సోషల్ మీడియా వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu-Ntr)కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్.

Junior NTR Birthday Wishes to AP CM Chandrababu Naidu

  • సీఎం చంద్రబాబుకు తారక్ శుభాకాంక్షలు
  • మావయ్య.. అంటూ ఆత్మీయ పలకరింపు
  • మీ నాయకత్వం స్ఫూర్తిదాయకం అంటూ ట్వీట్

Chandrababu-NTR: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రబాబును ‘మావయ్య’ అని ఆత్మీయంగా సంబోధిస్తూ.. ఆయన పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఎన్టీఆర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, అటు నందమూరి, ఇటు నారా అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారింది.

*మేనల్లుడితో ముద్దుగా.. ఫస్ట్ బర్త్ డే పిక్స్ షేర్ చేసిన ప్రగ్యా జైస్వాల్

చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్ల పాటు సుఖసంతోషాలతో ఉండాలని ఎన్టీఆర్(Chandrababu-Ntr) ఆకాంక్షించారు. ప్రజలకు సేవ చేయడంలో ఆయన చూపే అంకితభావం, పట్టుదల ఇలాగే కొనసాగాలని, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలు ఆయనకు చేకూరాలని కోరుకున్నారు. ఒక దార్శనికత కలిగిన నాయకుడిగా చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమని తన సందేశంలో పేర్కొన్నారు.

ముఖ్యంగా చంద్రబాబు నాయకత్వం రాష్ట్ర ప్రజల్లో గర్వాన్ని, అభివృద్ధిని నింపాలని ఎన్టీఆర్ అభిలషించారు. గత కొంతకాలంగా ఈ రెండు కుటుంబాల మధ్య రాజకీయ సంబంధాల గురించి రకరకాల చర్చలు నడుస్తున్న నేపథ్యంలో, ఎన్టీఆర్ స్వయంగా స్పందించి శుభాకాంక్షలు తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది.