Gaddar Awards : తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరిట ప్రతిష్టాత్మక గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2025 సంవత్సారానికి గాను గద్దర్ అవార్డుల విజేతలను జ్యూరీ సభ్యులు తాజాగా ప్రకటించారు. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డు ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా సర్టిఫికేట్ పొందిన సినిమాలకు ఈ అవార్డులను ప్రకటించారు.
ఈ ఏడాది మొత్తం 17 విభాగాల్లో అవార్డులను అందజేయనున్నట్లు తెలిపారు. సామాజిక, సందేశాత్మక చిత్రాలకు ప్రత్యేక అవార్డులతో పాటు డాక్టర్ సినారే, ఏఎన్ఆర్ పేర్లతో ప్రత్యేక పురస్కారాలను సైతం చేర్చడం జరిగింది.
ఉత్తర నటుడిగా నాగచైతన్య(తండేల్), ఉతమ నటిగా రష్మిక (ది గర్డ్ ఫ్రెండ్) నిలిచారు. ఇక మెగాస్టార్ చిరంజీవిని ఎన్టీఆర్ జాతీయ పురస్కారంతో సత్కరించనున్నారు. ప్రముఖ నటుడు కమల్ హాసన్‌కు పైడి జయరాజ్ అవార్డు, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజను సినారే అవార్డు, జయసుధను అక్కినేని నేషనల్ అవార్డు వరించింది.