KP Chowdary : డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నిర్మాత, కబాలి డిస్ట్రిబ్యూటర్.. భారీగా కొకైన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు..
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. డ్రగ్స్ వినియోగిస్తున్న నిర్మాత, కబాలి సినిమా తెలుగు డిస్ట్రిబ్యూటర్ KP చౌదరిని అదుపులోకి తీసుకున్నారు.
- Saketh U
- Published On : June 14, 2023 / 11:38 AM IST
Kabali Movie Telugu Distributor KP Chowdary arrested in Drugs case
KP Chowdary : కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. పోలీసుల సెర్చింగ్ ఆపరేషన్ లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఓ సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ని పోలీసులు డ్రగ్స్ కేసులో అదుపులోకి తీసుకున్నారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. డ్రగ్స్ వినియోగిస్తున్న నిర్మాత, కబాలి సినిమా తెలుగు డిస్ట్రిబ్యూటర్ KP చౌదరిని అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా ఈయన గోవాలో ఉండి డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు సమాచారం. పోలీసులు భారీగా కొకైన్ స్వాధీనం చేసుకొని KP చౌదరిని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ విషయంలో పోలీసులు మరింత సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
Sreeleela : శ్రీలీలను ఎత్తుకున్న బన్నీ.. ఈ కాంబినేషన్‌లో ఆహా కోసం స్పెషల్ మూవీ?
దీంతో టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టిస్తుంది. గతంలో కూడా పలువురు టాలీవుడ్ ప్రముఖులపై డ్రగ్స్ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ అరెస్ట్ తో మరో సారి పోలీసులు టాలీవుడ్ పై ఫోకస్ చేస్తారేమో చూడాలి.
